Share News

Ceasefire Amid Border Clashes: పాక్‌ అఫ్గాన్‌ మధ్య 48 గంటల కాల్పుల విరమణ

ABN , Publish Date - Oct 16 , 2025 | 04:24 AM

పాకిస్థాన్‌- అఫ్గానిస్థాన్‌ సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో ఇరుదేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Ceasefire Amid Border Clashes: పాక్‌ అఫ్గాన్‌ మధ్య 48 గంటల కాల్పుల విరమణ

ఇస్లామాబాద్‌, అక్టోబరు 15: పాకిస్థాన్‌- అఫ్గానిస్థాన్‌ సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో ఇరుదేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. బుధవారం సాయంత్రం నుంచి 48 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండనున్నట్లు పాకిస్థాన్‌ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది. ఈ విషయాన్ని రాయిటర్స్‌ వార్తా సంస్థ బుధవారం వెల్లడించింది. కాగా, పాకిస్థాన్‌ జరిపిన తాజా దాడుల్లో కనీసం 12 మంది పౌరులు మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడ్డారని, ఆ దాడులను సమర్థంగా ఎదుర్కొన్నామని తాలిబన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఘర్షణల నేపథ్యంలో ఇరుదేశాలు సరిహద్దు వాణిజ్య మార్గాలను మూసివేయడంతో వాటి మధ్య సరుకుల రవాణా నిలిచిపోయింది.

Updated Date - Oct 16 , 2025 | 04:24 AM