Nestle: నెస్లే లో 16 వేల ఉద్యోగాల కోత
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:42 AM
ప్రముఖ స్విట్జర్లాండ్ ఆహార దిగ్గజ సంస్థ ‘నెస్లే’ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది.
భారీ లే ఆ్‌ఫలకు సిద్ధమైన దిగ్గజ ఆహార సంస్థ
రానున్న రెండేళ్లలో తొలగింపునకు ప్రణాళికలు
జ్యూరిచ్, అక్టోబరు 16: ప్రముఖ స్విట్జర్లాండ్ ఆహార దిగ్గజ సంస్థ ‘నెస్లే’ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. రానున్న రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. ‘ప్రపంచం మారుతోంది.. దానికి తగ్గట్లే నెస్లే కూడా వేగంగా మారాల్సి ఉంది’ అని కంపెనీ సీఈవోగా గత నెల బాధ్యతలు చేపట్టిన ఫిలిప్ నవ్రాటిల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కఠినమైన నిర్ణయమేనని పేర్కొన్న ఆయన.. అయితే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనన్నారు. పొదుపు లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.