Public Harassment: మెక్సికో అధ్యక్షురాలికి లైంగిక వేధింపులు
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:15 AM
మెక్సికో దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్‌బాన్‌కు మంగళవారం షాకింగ్ ఘటన ఎదురైంది.
మెక్సికో సిటీ, నవంబరు 5: మెక్సికో దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్‌బాన్‌కు మంగళవారం షాకింగ్ ఘటన ఎదురైంది. ఆమెపై ఓ వ్యక్తి పట్టపగలు బహిరంగంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. షీన్‌బాన్ దేశ రాజధాని మెక్సికో సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రోడ్డుపక్కన ఉన్నవారిని కలిసి ముచ్చటిస్తుండగా.. ఓ వ్యక్తి ఆమె వెనక నుంచి వచ్చి ఆమెను పట్టుకొని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ఆమెను అసభ్యంగా తాకేందుకూ యత్నించాడు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి దుండగుడిని వెనక్కి లాగినా.. అతడు అధ్యక్షురాలికి సమీపంగా వెళ్లేదాకా నిర్లక్ష్యం వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.