Mexico Supermarket: మెక్సికోలోని సూపర్ మార్కెట్‌లో భారీ పేలుడు
ABN , Publish Date - Nov 03 , 2025 | 05:15 AM
మెక్సికోలోని ఓ సూపర్‌మార్కెట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 23 మంది ప్రాణాలు కోల్పోగా, 12 మందికి పైగా గాయపడ్డారు.
23 మంది మృతి, పలువురికి గాయాలు
మెక్సికో సిటీ, నవంబరు 2: మెక్సికోలోని ఓ సూపర్‌మార్కెట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 23 మంది ప్రాణాలు కోల్పోగా, 12 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. శనివారం హెర్మోసిల్లో నగరంలోని వాల్డోస్ అనే సూపర్‌మార్కెట్లో ఈ ఘటన జరిగింది. తమకు అందిన ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం పేలుళ్ల ద్వారా విడుదలైన విషపూరిత వాయువులను పీల్చుకొని ఎక్కువ మంది మృతి చెందారని రాష్ట్ర అటార్నీ జనరల్ తెలిపారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.