Share News

Thailand Prime Minister: కొంప ముంచిన ఫోన్ కాల్.. ప్రమాదంలో ప్రధాన మంత్రి పదవి

ABN , Publish Date - Jun 20 , 2025 | 09:31 PM

Thailand Prime Minister: ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతుండటంతో సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన భూమ్‌జయ్‌థాయ్ పార్టీ పక్కకు వచ్చేసింది. ఇక, చేసిన తప్పు గుర్తించిన షినవత్రా దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది.

Thailand Prime Minister: కొంప ముంచిన ఫోన్ కాల్.. ప్రమాదంలో ప్రధాన మంత్రి పదవి
Thailand Prime Minister

థాయ్‌లాండ్ దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఓ ఫోన్ కాల్ కారణంగా ప్రధాని పేటోగ్టార్న్ షినవత్రా చిక్కుల్లో పడింది. ఆమెపై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. థాయ్‌లాండ్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా.. పోతుందా అన్న పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. థాయ్‌లాండ్‌కు దాని పొరుగు దేశం కంబోడియాతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దానికి తోడు సరిహద్దు వివాదాలు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి.


కొన్ని రోజుల క్రితం కంబోడియా మాజీ ప్రధాని హున్ సెన్.. షినవత్రా‌కు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్‌లో ఆమె అతడ్ని అంకుల్ అని సంభోదించింది. ఇద్దరూ తమ దేశాల పరిస్థితి గురించి, రాజకీయాల గురించి కొంత సేపు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే షినవత్రా .. తనకు థాయ్ ఆర్మీ కమాండర్‌కు పడటం లేదని చెప్పింది. ఇప్పుడు ఆ ఫోన్ కాల్ లీకైంది. దీంతో సంకీర్ణ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. షినవత్రా రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతుండటంతో సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన భూమ్‌జయ్‌థాయ్ పార్టీ పక్కకు వచ్చేసింది. ఇక, చేసిన తప్పు గుర్తించిన షినవత్రా దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పింది. అయినా పరిస్థితిలో మార్పు రావటం లేదు. దాదాపు 69 మంది ఎంపీలు ఆమెకు వ్యతిరేకంగా మారారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో నెలకొన్న ఈ పరిస్థితులు చూస్తుంటే త్వరలో మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి

యోగా చేసిన శునకం.. అచ్చం మనుషుల్లానే..

7 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ.. చెక్ చేసుకోండి..

Updated Date - Jun 20 , 2025 | 09:56 PM