Share News

Radiation in Pakistan: పాకిస్థాన్‌కు పెను ముప్పు.. న్యూక్లియర్ కేంద్రాల నుంచి రేడియేషన్ లీక్ అవుతోందా

ABN , Publish Date - May 14 , 2025 | 06:13 PM

భారత దాడిలో పాకిస్థాన్ ఘోరంగా దెబ్బతిందా? అందుకే కాళ్ల బేరానికి వచ్చిందా? పాకిస్థాన్ అణు స్థావరాలపై భారత్ దాడి చేసిందా? అంటే అవుననే అంటున్నారు సోషల్ మీడియా జనాలు. పాకిస్థాన్ అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్ అవుతోందని సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు.

Radiation in Pakistan: పాకిస్థాన్‌కు పెను ముప్పు.. న్యూక్లియర్ కేంద్రాల నుంచి రేడియేషన్ లీక్ అవుతోందా
Leakage from Pakistans nuclear facility

భారత దాడిలో పాకిస్థాన్ (Pakistan) ఘోరంగా దెబ్బతిందా? అందుకే కాళ్ల బేరానికి వచ్చిందా? పాకిస్థాన్ అణు స్థావరాలపై భారత్ దాడి చేసిందా? అంటే అవుననే అంటున్నారు సోషల్ మీడియా జనాలు. పాకిస్థాన్ అణు స్థావరాల (Pakistans nuclear facility) నుంచి రేడియేషన్ లీక్ అవుతోందని సోషల్ మీడియా జనాలు తెగేసి చెబుతున్నారు. అందుకు తగిన ఆధారాలను కూడా చూపెడుతున్నారు.

పెహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలపై దాడి చేసింది. అందుకు ప్రతిగా పాకిస్థాన్ కూడా కాల్పులు ప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి (Radiation leaking).


భారత సైన్యం పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో పాకిస్థాన్ అణు కేంద్రమైన సర్గోదా తీవ్రంగా దెబ్బతిన్నట్టు వార్తలు వస్తున్నాయి. సర్గోదా ఎయిర్‌బేస్‌కు సమీపంలోని కిరాణ హిల్స్‌కు సమీపంలో పాకిస్థాన్ న్యూక్లియర్ సెంటర్ ఉంది. భారత్ తన క్షిపణులతో సర్గోదా, నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లపై దాడి చేసింది. దీంతో దెబ్బతిన్న రియాక్టర్ల నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్టు చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. స్థానికులు వాంతులు, తలనొప్పి, ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ హాస్పిటల్స్‌లో జాయిన్ అవుతున్నారని, ఆర్మీ అధికారులు అసలు విషయాన్ని బయటకు చెప్పడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


ఇక, ఈజిప్ట్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ విమానం ఒకటి బోరాన్-10 ఐసో‌టోప్‌తో మంగళవారం ఉదయం పాకిస్థాన్‌కు చేరుకుందని వార్తలు వస్తున్నాయి. అణు స్థావరాల్లో రసాయణ చర్యలను నిరోధించడానికి బోరాన్‌ను ఉపయోగిస్తారు. అలాంటి రసాయనం పాకిస్థాన్‌కు అవసరం పడిందంటే రేడియేషన్ లీకేజ్ అనేది నిజమే అయి ఉండొచ్చని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ రేడియేషన్ లీకేజ్ అంశాన్ని అటు అమెరికా అధికారులు, ఇటు భారత సైన్యం ఖండించాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 14 , 2025 | 06:41 PM