Khawaja Asif: ఆయుధ బేహారి అమెరికా
ABN , Publish Date - May 26 , 2025 | 02:20 AM
యుద్ధాల ద్వారా తమ ఆయుధ పరిశ్రమలకు లాభాలు పొందేందుకు అమెరికా ఉద్దేశపూర్వకంగా ప్రపంచ దేశాల్లో ఘర్షణలు సృష్టిస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు. అదే సమయంలో తమ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారన్న విషయం కూడా ఆయన అంగీకరించారు.
యుద్ధాలకు ఆజ్యం పోసి ఆయుధాలు అమ్ముకుంటోంది: పాక్ రక్షణ మంత్రి
ఇస్లామాబాద్, మే 25: తమ ఆయుధ పరిశ్రమలకు లబ్ధి చేకూర్చేందుకు అమెరికా ఉద్దేశపూర్వకంగానే ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలకు ఆజ్యం పోస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గత వందేళ్లలో అమెరికా 260 యుద్ధాలు చేసింది. చైనా మూడు యుద్ధాలే చేసింది. అయినప్పటికీ అమెరికా డబ్బు సంపాదిస్తూనే ఉంది. వారి మిలిటరీ పరిశ్రమ చాలా పెద్దది. వారి జీడీపీలో సింహ భాగం ఆ రంగం నుంచే వస్తోంది. అందుకే వారు ఘర్షణలు సృష్టిస్తూనే ఉన్నారు’ అన్నారు. సిరియా, ఈజిప్టు, అఫ్ఘానిస్థాన్, లిబియా ఒకప్పుడు సంపన్న దేశాలని, సుదీర్ఘ యుద్ధాలతో ఇప్పుడవి నాశనమయ్యాయని చెప్పారు. ఆ దేశాల పతనంలో అమెరికా ప్రమేయం ఉందని పేర్కొన్నారు. తమ మిలిటరీ పరిశ్రమ లాభదాయకంగా కొనసాగేందుకు యుద్ధాల్లో అమెరికా ఇరు పక్షాల తరఫునా పాత్ర పోషిస్తుందని ఆసిఫ్ ఆరోపించారు. అమెరికా రక్షణ రంగం ఘర్షణలు, అస్థిరతలపై ఆధారపడి వృద్ధి చెందుతోందన్నారు. ఆసిఫ్ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర ప్రతిస్పందనలు వస్తున్నాయి. మరి మీరెందుకు అమెరికా నుంచి ఆయుధాలు కొంటున్నారంటూ పలువురు నిలదీస్తున్నారు. మరోవైపు, తమ దేశం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని ఆసిఫ్ పునరుద్ఘాటించారు. తమ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారని ఆయన మరోసారి అంగీకరించారు. అఫ్ఘానిస్థాన్‌లో జరిగిన రెండు యుద్ధాల్లో అమెరికా ఆదేశంతో పాకిస్థాన్ పాల్గొందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Minister Satyakumar: 2047 నాటికి ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ ఎదగడం ఖాయం
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..
Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్, దాని నీచమైన నిర్వాహకుడు పాక్.. నిప్పులు చెరిగిన అభిషేక్
India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి