Share News

India China Exports: చైనాకు భారత ఎగుమతులు జంప్‌

ABN , Publish Date - Aug 23 , 2025 | 02:57 AM

ఉద్రిక్తతల ఉపశమనం.. అమెరికా అడ్డగోలు టారిఫ్‌ల నేపథ్యంలో చైనాతో భారత వాణిజ్యం మళ్లీ గాడినపడుతోంది...

India China Exports: చైనాకు భారత ఎగుమతులు జంప్‌

  • ఉద్రిక్తతలు తగ్గడంతో 4 నెలల్లోనే 20ు వృద్ధి

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఉద్రిక్తతల ఉపశమనం.. అమెరికా అడ్డగోలు టారిఫ్‌ల నేపథ్యంలో చైనాతో భారత వాణిజ్యం మళ్లీ గాడినపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే (ఏప్రిల్‌-జూలై మధ్య) భారత ఎగుమతులు ఏకంగా 19.97 శాతం పెరిగాయి. వీటి విలువ రూ.49,013 కోట్లు (5.76 బిలియన్‌ డాలర్లు). ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2023-24లో రూ.1.46 లక్షల కోట్ల ఎగుమతులు జరుగగా.. 24-25లో రూ.1.25 లక్షల కోట్లకు తగ్గాయి. 25-26లో మొదటి నాలుగు నెలల్లోనే రూ.49,013 కోట్లకు చేరడం.. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఇటీవలి భారత పర్యటనలో ఉభయ దేశాలు నిర్ణయించడం, ప్రభుత్వంగా సరిహద్దుల్లో లిపులేక్‌ పాస్‌, షిప్కి లా పాస్‌, నాథు లా పాస్‌ వాణిజ్య మార్గాలను తిరిగి తెరవాలని నిశ్చయించడం.. తదితర పరిణామాలతో చైనాకు ఇండియా ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగానే పెరిగే అవకాశముందని అధికార వర్గాలు అంటున్నాయి. ఏప్రిల్‌-జూలై నడుమ ఎగుమతుల్లో ఇంధన, ఎలకా్ట్రనిక్స్‌, ఆహార పదార్థాల వాటా అత్యధికంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్లో 12.9ు, మేలో 24ు, జూన్‌లో 17ు, జూలైలో 27 శాతానికి ఎగుమతులు చేరాయి. వాస్తవానికి 2024-25లో చైనాతో ఇండియా వాణిజ్య లోటు రూ.8.69 లక్షల కోట్లుగా ఉంది. తాజా పరిణామాలతో ఈ ఏడాది ఈ లోటు కొంతవరకు భర్తీ అవుతుందన్న ఆశాభావం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Updated Date - Aug 23 , 2025 | 02:57 AM