Harvard University: హార్వర్డ్‌లో కీలక పదవుల్లో భారతీయులు
ABN , Publish Date - May 28 , 2025 | 06:43 AM
హార్వర్డ్ యూనివర్శిటీలో భారతీయుల ప్రాభావం పెరుగుతోంది. కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్ రంగాల్లో తెలుగు మహిళ హిమబిందు లక్కరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు.
వారిలో తెలుగు మూలాలున్న హిమబిందు
వాషింగ్టన్, మే 26: హార్వర్డ్‌పై ట్రంప్ నిర్ణయం మాట ఎలా ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయంలోని పలు విభాగాలకు భారతీయులు ఆధిపత్యం వహిస్తుండడం విశేషం. ముఖ్యంగా హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఇండియన్-అమెరికన్‌ల పాత్ర గణనీయంగా ఉంది. శ్రీకాంత్ ఎం దాతర్, నితిన్ నోహ్రియా, తరుణ్ ఖన్నా, భరత్ ఎస్ ఆనంద్, అమితాబ్ చంద్ర, పృథ్వీరాజ్ చౌదరి తదితర 20 మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. ఈ జాబితాలో తెలుగు మహిళ హిమబిందు లక్కరాజు కూడా ఉన్నారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నప్పటికీ ఇతర విభాగాలతోనూ ఆమెకు సంబంధం ఉంది. కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్ ఇనిషియేటివ్, సెంటర్ ఫర్ రీసెర్స్ ఆన్ కంప్యుటేషన్ అండ్ సొసైటీ, లేబరేటరీ ఆఫ్ ఇన్నోవేషన్ సైన్స్ వంటి విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. ఏఐ4లైఫ్ అనే పరిశోధన విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. పోస్ట్ డాక్టరల్, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నారు. కృత్రిమ మేథ, మిషన్ లెర్నింగ్ రంగాల్లో స్టార్ట్‌పలు పెట్టాలనుకునే వారికి సలహాలు ఇస్తుంటారు. కృత్రిమ మేథను సామాన్యులను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆమె స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఎం.ఎస్, పీహెచ్‌డీ పట్టాలను అందుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News