Share News

Mehul Goswami: అమెరికాలో రెండు ఉద్యోగాలు చేస్తోన్న భారతీయుడి అరెస్టు

ABN , Publish Date - Oct 25 , 2025 | 04:20 AM

అమెరికాలో రెండు ఉద్యోగాలు(మూన్‌లైటింగ్‌) చేస్తోన్న ఓ భారతీయుడిని అక్కడి అధికారులు అరెస్టు చేశారు.

Mehul Goswami: అమెరికాలో రెండు ఉద్యోగాలు చేస్తోన్న భారతీయుడి అరెస్టు

  • 15 ఏళ్ల జైలుశిక్ష విధించే అవకాశం!

న్యూయార్క్‌, అక్టోబరు 24 : అమెరికాలో రెండు ఉద్యోగాలు(మూన్‌లైటింగ్‌) చేస్తోన్న ఓ భారతీయుడిని అక్కడి అధికారులు అరెస్టు చేశారు. మెహుల్‌ గోస్వామి(39) అనే ఆ వ్యక్తి న్యూయార్క్‌లో ఉంటూ.. న్యూయార్క్‌ స్టేట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అదే సమయంలో మాల్టా పట్టణంలోని గ్లోబల్‌ ఫౌండ్రీస్‌ అనే సెమికండక్టర్‌ కంపెనీలో 2022 మార్చి నుంచి కాంట్రాక్టర్‌గానూ చేస్తున్నాడు. దీనిపై ఒక ఈమెయిల్‌ ద్వారా సమాచారం అందడంతో అధికారులు విచారణ చేపట్టి అతడు రెండు ఉద్యోగాలు చేస్తున్నట్లు నిర్ధారించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిజాయితీగా నిర్వహించాలని, కాని గోస్వామి దాన్ని ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 15న గోస్వామిని అరెస్టు చేసి జడ్జి ముందు హాజరుపరిచారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై అతడు విడుదల అయ్యాడు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. విచారణలో నేరం నిరూపణ అయితే అతడికి దాదాపు 15 ఏళ్ల జైలుశిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉందని అంచనా.

Updated Date - Oct 25 , 2025 | 04:20 AM