Share News

India China Relations: విభేదాలు వివాదాలుగా మారొద్దు

ABN , Publish Date - Aug 19 , 2025 | 02:31 AM

విభేదాలు వివాదాలుగా మారొద్దని చైనాకు భారత్‌ సూచించింది. భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో సమావేశం సందర్భంగా విదేశాంగమంత్రి జైశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య .....

India China Relations: విభేదాలు వివాదాలుగా మారొద్దు

చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో జై శంకర్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 18: విభేదాలు వివాదాలుగా మారొద్దని చైనాకు భారత్‌ సూచించింది. భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో సమావేశం సందర్భంగా విదేశాంగమంత్రి జైశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా సాగాలన్నారు. దీనికి రెండు వైపుల నుంచి నిజాయితీతో పాటు నిర్మాణాత్మక సహకారం అవసరమని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణాన్ని సంయుక్తంగా నెలకొల్పడం అవసరమన్నారు. అదే సమయంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పీచమణచాల్సిందేనని జై శంకర్‌ స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా వాంగ్‌ యీ మంగళవారం ప్రధాని మోదీతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెలాఖరులో చైనాలో జరిగే షాంఘై కార్పొరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సుకు మోదీ హాజరుకానున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

Updated Date - Aug 19 , 2025 | 02:31 AM