Share News

India Reconsiders Chinese: చైనా పెట్టుబడులకు గేట్లు బార్లా

ABN , Publish Date - Aug 19 , 2025 | 02:33 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై 50 శాతం సుంకాలను విధించిన నేపథ్యంలో మోదీ సర్కారు చైనాతో వాణిజ్య, రాజకీయ సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ..

India Reconsiders Chinese: చైనా పెట్టుబడులకు గేట్లు బార్లా

  • ట్రంప్‌ టారిఫ్‌ల నేపథ్యంలో డ్రాగన్‌తో భారత్‌ దోస్తీ

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై 50 శాతం సుంకాలను విధించిన నేపథ్యంలో మోదీ సర్కారు చైనాతో వాణిజ్య, రాజకీయ సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా చైనా పెట్టుబడులకు గతంలో మూసేసిన గేట్లను మళ్లీ తెరవాలనుకుంటోంది. పునరుత్పాదక ఇంధనం, మాన్యుఫాక్చరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ వంటి ప్రాధాన్యేతర రంగాల్లో చైనా కంపెనీల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్రం వద్ద దాదాపు 200 చైనా ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. 2020లో గల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనాతో రాజకీయ, ఆర్థిక సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. మన సర్కారు చైనా పెట్టుబడులపై ఆంక్షలు విధించింది అప్పుడే. కానీ, అమెరికా సుంకాల పోరును తట్టుకునేందుకు ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు ఇరు దేశాలు మళ్లీ నడుం బిగించాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ సోమవారం భారత్‌కు రావటం ఇందుకు మొదటి అడుగుగా చూడవచ్చు. ఆయన 3రోజుల పాటు పర్యటించనున్నారు.

Updated Date - Aug 19 , 2025 | 02:33 AM