Bilateral Relations: భారత్ ఫిలిప్పీన్స్ మధ్య 9 ఒప్పందాలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 06:03 AM
సహజ సిద్ధ మిత్రులైన భారత్, ఫిలిప్పీన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మకంగా బలో
న్యూఢిల్లీ, ఆగస్టు 5: సహజ సిద్ధ మిత్రులైన భారత్, ఫిలిప్పీన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మకంగా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ పర్యటకు వచ్చిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినంద్ ఆర్ మాక్రోస్ జూనియర్, ప్రధాని మోదీ మధ్య మంగళవారం ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. సైనిక బలగాల సంయుక్త విన్యాసాలు పెంపొందిస్తూ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల నౌకా దళాలు సంయుక్త విన్యాసాలు జరిపిన మరునాడే తొమ్మిది భాగస్వామ్య ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు.