Share News

తుర్కియే, చైనా మీడియా సంస్థలపై భారత్‌ ఆంక్షలు

ABN , Publish Date - May 15 , 2025 | 05:26 AM

ఆపరేషన్‌ సిందూర్‌పై పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారానికి వంత పాడుతున్న తుర్కియే, చైనా మీడియా సంస్థల ఎక్స్‌ ఖాతాలపై భారత్‌ బుధవారం ఆంక్షలు విధించింది.

తుర్కియే, చైనా మీడియా సంస్థలపై భారత్‌ ఆంక్షలు

  • అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలు నిలిపివేత

న్యూఢిల్లీ, మే 14: ఆపరేషన్‌ సిందూర్‌పై పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారానికి వంత పాడుతున్న తుర్కియే, చైనా మీడియా సంస్థల ఎక్స్‌ ఖాతాలపై భారత్‌ బుధవారం ఆంక్షలు విధించింది. తుర్కియే ప్రభుత్వ ఆధీనంలోని ప్రసార సంస్థ ’టీఆర్‌టీ వరల్డ్‌’ ఎక్స్‌ ఖాతాను కేంద్రం నిలిపివేసింది. తుర్కియే డ్రోన్లతో భారత్‌పై పాకిస్థాన్‌ దాడి చేసిన కొద్దిరోజులకే ఈ చర్య తీసుకోవడం గమనార్హం. అదేసమయంలో చైనా అధికారిక మీడియా సంస్థలైన ’గ్లోబల్‌ టైమ్స్‌’, ’జిన్హువా’ ఎక్స్‌ ఖాతాలను కూడా కేంద్రం భారత్‌లో నిషేధించింది.


ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని పోస్టు చేసినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఖాతాలను యాక్సెస్‌ చేయడానికి ప్రయత్నిస్తే ’’చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా భారత్‌లో మీ ఖాతా నిలిపివేశాం’’ అనే సందేశం కనిపిస్తోంది.

Updated Date - May 15 , 2025 | 05:26 AM