Share News

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ సురక్షితం.. వదంతులకు తెర

ABN , Publish Date - Dec 02 , 2025 | 08:06 PM

ఇమ్రాన్ ఖాన్‌ను కలుసుకునేందుకు, ఆయన మానసిక పరిస్థితిని తెలుసుకునేందుకు అనుమతించాలంటూ ఆయన మద్దతుదారులు షెహబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారంనాడు తీవ్ర నిరసనలు తెలియజేశారు.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ సురక్షితం.. వదంతులకు తెర
Imran Khan

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan) జైలులోనే మృతి చెందినట్టు వచ్చిన వదంతులు ఉత్తవే అని తేలాయి. ఆయన సురక్షితంగానే ఉన్నట్టు ఇమ్రాన్‌ సోదరి ఉజ్మా ఖానుమ్ ప్రకటించారు. అడియాలా జైలులో ఉన్న ఆయనను కలుసుకునేందుకు అనుమతించాలంటూ పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగడంతో జైలు అధికారులు ఉజ్మా ఖానుమ్‌ను మంగళవారంనాడు అనుమతించారు. తన సోదరుడిని కలుసుకున్న అనంతరం ఇమ్రాన్ సజీవంగా, ఫిట్‌నెట్‌తో ఉన్నారని ఆమె వెల్లడించారు. అయితే మానసికంగా వేధిస్తుండటం, ఎవరితోనూ మాట్లాడేందుకు అనుతించకపోవడంపై ఆయన చాలా కోపంగా ఉన్నారని చెప్పారు.


ఇమ్రాన్ ఖాన్‌ను కలుసుకునేందుకు, ఆయన మానసిక పరిస్థితిని తెలుసుకునేందుకు అనుమతించాలంటూ ఆయన మద్దతుదారులు షెహబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారంనాడు తీవ్ర నిరసనలు తెలిపారు. పీటీఐ ఎంపీలు ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల, ఇమ్రాన్ సోదరీమణులు మద్దతుదారులతో కలిసి జైలు బయట నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో జైలు చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.


ఇమ్రాన్‌ఖాన్ జైలులోనే మరణించినట్టు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు దావానలంగా మారాయి. జైలులోనే ఇమ్రాన్‌ను చంపేందుకు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్‌తో ఐఎస్ఐ కుట్ర పన్నిందంటూ బలూచిస్థాన్ విదేశాంగ శాఖ ఆరోపించడంపై ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఇమ్రాన్‌ను చూసేందుకు తమను అనుమతించడం లేదంటూ జైలు పరింటెండెంట్, ఇతర అధికారులపై ఆయన సోదరి అలీమా కోర్టులో పిటిషన్ కూడా వేశారు. పీటీఐ కార్యకర్తలు తమ ఆందోళనలను ఉధృతం చేయడంతో ఎట్టకేలకు ఇమ్రాన్‌ను కలుసుకునేందుకు ఉజ్మాను జైలు అధికారులు అనుమతించారు.


ఇవి కూడా చదవండి..

వచ్చే పదేళ్లలో అణు యుద్ధం తప్పదు.. ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..

ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా ఆదాయాన్ని కోల్పోనున్న అమెరికా యూనివర్సిటీలు

Updated Date - Dec 02 , 2025 | 08:18 PM