Mali : మాలిలో బంగారం గని కూలి 42 మంది మృతి
ABN , Publish Date - Feb 17 , 2025 | 05:32 AM
పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. కెనీబా జిల్లాలో బంగారు గని కూలి 42 మంది దుర్మరణం పాలయ్యారని, అనేక మంది గాయపడ్డారని స్థానిక మీడియా, అధికారులు వెల్లడించారు. కెనీబా

బమాకో (మాలి), ఫిబ్రవరి 16: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. కెనీబా జిల్లాలో బంగారు గని కూలి 42 మంది దుర్మరణం పాలయ్యారని, అనేక మంది గాయపడ్డారని స్థానిక మీడియా, అధికారులు వెల్లడించారు. కెనీబా జిల్లా డాబియా కమ్యూన్‌లోని బిలాలీ టోకో వద్ద శనివారం రాత్రి బంగారు గని కూలిపోయినట్టు మాలియన్ టెలివిజన్ ప్రకటించింది. చైనాకు చెందిన వారు ఈ గోల్డ్ మైన్‌ను నడుపుతున్నారని, ఈ ప్రాంతంలో మట్టిపెళ్లలు విరిగిపడడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు ధ్రువీకరించారు.