Share News

Gopichand Hinduja: హిందూజా గ్రూప్‌ చైర్మన్‌ గోపీచంద్‌ కన్నుమూత

ABN , Publish Date - Nov 05 , 2025 | 05:03 AM

హిందూజా గ్రూపు చైర్మన్‌ గోపీచంద్‌ పి హిందూజా(85) మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లండన్‌లో చికిత్స పొందుతూ చనిపోయినట్లు గోపీచంద్‌ సన్నిహితులు తెలిపారు.

Gopichand Hinduja:  హిందూజా గ్రూప్‌ చైర్మన్‌ గోపీచంద్‌ కన్నుమూత

లండన్‌, అక్టోబరు 4: హిందూజా గ్రూపు చైర్మన్‌ గోపీచంద్‌ పి హిందూజా(85) మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లండన్‌లో చికిత్స పొందుతూ చనిపోయినట్లు గోపీచంద్‌ సన్నిహితులు తెలిపారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పేరుగడించిన గోపీచంద్‌.. బ్రిటన్‌లోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందినవారు. నలుగురు హిందూజా సోదరులలో రెండోవారైన గోపీచంద్‌ తన అన్న శ్రీచంద్‌ 2023లో చనిపోయిన తర్వాత హిందూజా గ్రూప్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1959లో ముంబైలోని జైహింద్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ఆయన.. తర్వాత వ్యాపార రంగలోకి ప్రవేశించారు. హిందూజా గ్రూపునకు చెందిన అశోక్‌ లేలాండ్‌ సంస్థ వాణిజ్య వాహనాల తయారీలో ప్రపంచంలోనే పేరుగాంచినది. గోపీచంద్‌ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సంతాపం ప్రకటించారు.

Updated Date - Nov 05 , 2025 | 05:04 AM