Visa Program: హెచ్1బీ వీసా మరింత కఠినం
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:33 AM
ఇప్పటికే హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ ప్రభుత్వం.. ఆ వీసా కార్యక్రమాల్లో మరింత కఠిన సంస్కరణలు తీసుకురానుంది......
వాషింగ్టన్, అక్టోబరు 10: ఇప్పటికే హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ ప్రభుత్వం.. ఆ వీసా కార్యక్రమాల్లో మరింత కఠిన సంస్కరణలు తీసుకురానుంది. వీసా పరిమితి మినహాయింపుల అర్హత నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు, ఉద్యోగాలు కల్పించే కంపెనీలను క్షుణ్ణంగా పరిశీలించాలని, థర్డ్ పార్టీ ప్లేస్‌మెంట్స్‌పై మరింత దృష్టి పెట్టాలని నిర్ణయించింది. హెచ్1బీ వీసా కార్యక్రమాల్లో మార్పులు చేయడానికి యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదనలు చేసింది. ఇవి ఫెడరల్ రిజిస్టర్‌లో ‘రిఫార్మింగ్ ది హెచ్1బీ నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్’ పేరుతో నమోదయ్యాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే విదేశీ నిపుణులపై ఆధారపడ్డ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడతాయి. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీలు అయితే వీసా ఖర్చులు భరించలేవు.