Share News

Mauritius : మారిషస్‌ మాజీ ప్రధాని జగన్నాథ్‌ అరెస్ట్‌

ABN , Publish Date - Feb 17 , 2025 | 05:28 AM

మారిషస్‌ మాజీ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌ను మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ చేశారు. ఆయన నివాసాలు, కార్యాలయలపై ఆ దేశ ఆర్ధిక నేరాల కమిషన్‌ సోదాలు జరిపి కీలక పత్రాలను, ఖరీదైన గడియారాలు, వివిధ

Mauritius : మారిషస్‌ మాజీ ప్రధాని జగన్నాథ్‌ అరెస్ట్‌

పోర్ట్‌ లోయిస్‌, ఫిబ్రవరి16: మారిషస్‌ మాజీ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌ను మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ చేశారు. ఆయన నివాసాలు, కార్యాలయలపై ఆ దేశ ఆర్ధిక నేరాల కమిషన్‌ సోదాలు జరిపి కీలక పత్రాలను, ఖరీదైన గడియారాలు, వివిధ దేశాలకు చెందిన కరెన్సీని స్వాధీనం చేసుకుంది. జగన్నాథ్‌ భార్య కోబితను కూడా అరెస్ట్‌ చేశారు. 2017 నుంచి 2024 వరకు ఆయన ప్రధానిగా కొనసాగారు. 2024లో జగన్నాధ్‌ రాజీనామా చేశాక నవీన్‌ రామ్‌గులామ్‌ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. జగన్నాథ్‌ హయాంలో కుదిరిన ఆర్థిక ఒప్పందాల్లో ఆర్ధిక అవకతవకలు జరిగాయంటూ కొత్త ప్రధాని దర్యాప్తునకు ఆదేశించారు.

Updated Date - Feb 17 , 2025 | 05:28 AM