Share News

Donald Trump: హార్వర్డ్‌పై విజయం సాధిస్తా

ABN , Publish Date - May 28 , 2025 | 06:38 AM

హార్వర్డ్‌ వర్సిటీపై ట్రంప్‌ యుద్ధం ప్రకటిస్తూ విదేశీ విద్యార్థులకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకటించారు. హార్వర్డ్‌కు మంజూరయ్యే గ్రాంట్లు, విదేశీ విద్యార్థుల ట్యూషన్‌ ఫీజులపై దృష్టి పెట్టడంతో భారత విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.

Donald Trump: హార్వర్డ్‌పై విజయం సాధిస్తా

వాషింగ్టన్‌, మే 26: హార్వర్డ్‌ వర్సిటీపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో విజయం సాధిస్తామని కూడా ఆయన తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో సోమవారం ఆయన పోస్టు పెడుతూ ‘‘యూదు వ్యతిరేక హార్వర్డ్‌కు ఇచ్చే గ్రాంట్లలో మూడు బిలియన్‌ డాలర్ల మేర కోత విధించాలని అనుకుంటున్నాం. వాటిని దేశంలోని ఇతర డ్రేడ్‌ స్కూళ్లకు మళ్లిస్తాం’’ అని పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులు చెల్లించే ట్యూషన్‌ ఫీజులే హార్వర్డ్‌కు పెద్ద ఆదాయ వనరు కావడంతో వాటిపైనా దృష్టి పెట్టారు. విదేశీ విద్యార్థుల జాబితా ఇవ్వాలని అడిగినట్టు తెలిపారు. ‘‘ఆ జాబితా వస్తే దేశంలోకి ఎంతమంది రాడికల్‌ పిచ్చోళ్లు, సమస్యలను సృష్టించే వారు వస్తున్నారో తెలుసుకోవచ్చు. బిలియన్ల కొద్దీ డాలర్లను ఇలాంటి పనికిమాలిన వారి కోసం ఖర్చు పెడుతున్నాం. అయినా భయం లేదు. ప్రభుత్వం విజయం సాధిస్తుంది’’ అని పేర్కొన్నారు. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులు చేరకుండా ఆదేశాలు ఇచ్చినప్పటికీ న్యాయస్థానం దాన్ని సస్పెండ్‌ చేయడం గమనార్హం. ట్రంప్‌ నిర్ణయంతో భారతీయ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 06:38 AM