Japan Causes Closure: జపాన్‌లో ఫ్లూ కలకలం..135 బడుల మూసివేత
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:19 AM
కొవిడ్ మహమ్మారి అనంతరం, తాజాగా ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ) విజృంభణతో జపాన్‌లో కలకలం రేగింది.
టోక్యో, అక్టోబరు 15: కొవిడ్ మహమ్మారి అనంతరం, తాజాగా ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ) విజృంభణతో జపాన్‌లో కలకలం రేగింది. సాధారణ ఫ్లూ సీజన్ కంటే దాదాపు నెల రోజుల ముందుగానే ఇన్‌ఫెక్షన్లు తీవ్ర స్థాయికి చేరడంతో దేశవ్యాప్తంగా ఫ్లూ మహమ్మారి వ్యాప్తిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 6వేల మందికి పైగా రోగులు తీవ్ర జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఫ్లూ ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపుతోంది. దీంతో టోక్యో, ఒకినావా, కగోషిమా వంటి నగరాల్లో 135 పాఠశాలలతో పాటు శిశు సంరక్షణ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు దేశవ్యాప్తంగా కొవిడ్-19 నిబంధనలను కూడా అమలు చేస్తున్నారు. ఫ్లూ వ్యాప్తిని చూసి మరోసారి కొవిడ్ లాంటి మహమ్మారి ముంచుకొస్తుందేమోననిప్రజలు భయపడుతున్నారు.