Elon Musk : భారత్‌లో ఓటింగ్ పెంపునకు అమెరికా కేటాయించిన రూ.182 కోట్ల రద్దు
ABN , Publish Date - Feb 17 , 2025 | 05:20 AM
భారత్‌లో ఓటింగ్ శాతం పెంచడానికి ఉద్దేశించిన రూ.182 కోట్ల సాయాన్ని రద్దు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) ప్రకటించింది. అమెరికాలోని పన్ను

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం నిర్ణయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: భారత్‌లో ఓటింగ్ శాతం పెంచడానికి ఉద్దేశించిన రూ.182 కోట్ల సాయాన్ని రద్దు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) ప్రకటించింది. అమెరికాలోని పన్ను చెల్లింపుదారులు కట్టే సొమ్మును వివిధ దేశాల కోసం ఖర్చు పెడుతున్నారని, వాటన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఆదివారం చేసిన పోస్టులో తెలిపింది. అలాగే బంగ్లాదేశ్‌లో రాజకీయ స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి కేటాయించిన రూ.215 కోట్లు, మొజాంబిక్ రూ.86 కోట్లు, నేపాల్ రూ.338 కోట్లు, లైబీరియా రూ.13 కోట్లు, మాలి రూ.121 కోట్లతో పాటు అనేక దేశాలకు కేటాయించిన సాయాన్ని కూడా డోజ్ రద్దు చేసింది. డోజ్ తాజా నిర్ణయంపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందించారు. ‘దేశంలో ఓటర్ల శాతం పెంచేందుకు 21మిలియన్ డాలర్లా? ఇది భారతదేశ ఎన్నికల ప్రక్రియలో బాహ్య శక్తుల జోక్యం కాకపోతే మరేంటి? దీనినుంచి ఎవరు లాభపడుతున్నారు? కచ్చితంగా అధికార పార్టీ మాత్రం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, 2012లో ఎన్నికల సంఘానికి తాను నేతృత్వం వహించినప్పుడు దేశంలో ఓటింగ్ శాతం పెంచడానికి మిలియన్ డాలర్ల నిధుల కోసం అమెరికా ఏజెన్సీతో ఎంవోయూ చేసుకున్నట్లు వస్తున్న వార్తలు నిరాధారమైనవని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ తోసిపుచ్చారు.