Donald Trump: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ట్రంప్ ఫోన్
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:59 AM
డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఫోన్ చేశారు. వాణిజ్యం, టిక్‌టాక్ తదితర అంశాలపై చర్చించారు.

వాషింగ్టన్, జనవరి17: డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఫోన్ చేశారు. వాణిజ్యం, టిక్‌టాక్ తదితర అంశాలపై చర్చించారు. ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకోవాలని నిర్ణయించారు. కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనని, అయితే ఒకరినొకరు గౌరవించుకుంటూ పరిష్కారం కోసం యత్నించాలని నిర్ణయించారు. జిన్‌పింగ్‌తో ఫోన్ సంభాషణ తర్వాత ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా ఈ విషయాలు వెల్లడించారు. సంయుక్తంగా అనేక సమస్యలను పరిష్కరించగలమనే ధీమాను వ్యక్తం చేశారు. ఈ నెల 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.