Share News

Germany: ఉక్రెయిన్‌ దీర్ఘశ్రేణి ఆయుధాలు వాడటానికి ఓకే

ABN , Publish Date - May 28 , 2025 | 06:53 AM

జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఉక్రెయిన్‌కు రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి అనుమతి ఇచ్చారని ప్రకటించారు. ఇది ఉక్రెయిన్‌ రష్యా సైనిక వసతులపై సుదీర్ఘ దాడులు చేయడానికి సహాయపడుతుంది.

Germany: ఉక్రెయిన్‌ దీర్ఘశ్రేణి ఆయుధాలు వాడటానికి ఓకే

ఆ దేశానికి అనుమతి ఇచ్చామన్న జర్మనీ చాన్సలర్‌ మెర్జ్‌

న్యూఢిల్లీ, మే 27 : రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి ఉక్రెయిన్‌ను అనుమతించినట్లు జర్మనీ చాన్సలర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ తెలిపారు. బెర్లిన్‌లో సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు తాము సరఫరా చేసిన ఆయుధాలపై అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ నియంత్రణ ఎత్తివేసినట్లు చెప్పారు. దీంతో ఆ దేశం తనను తాను సమర్థంగా రక్షించుకోగలదని, రష్యా సైనిక వసతులపైనా దాడులు చేయగలదని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా ఇటీవల క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడి చేసిన తర్వాత ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 06:53 AM