Canada: కెనడా మంత్రివర్గంలో భారత సంతతి మహిళలు
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:41 AM
ఇండో-కెనడియన్ అనితా అనంద్ (58) ఆవిష్కరణలు, సైన్స్, పరిశ్రమల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఢిల్లీలో జన్మించిన కమల్ ఖేరా (36) ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కెనడా పార్లమెంటుకు ఎన్నికయిన మహిళల్లో ఆమె అత్యంత పిన్న వయస్కురాలన్న గుర్తింపును ఇప్పటికే పొందారు.

అట్టావా, మార్చి 15: కెనడా నూతన ప్రధాని మార్క్ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు చోటు దక్కింది. వారిద్దరూ మహిళలు కావడం విశేషం. ఇండో-కెనడియన్ అనితా అనంద్ (58) ఆవిష్కరణలు, సైన్స్, పరిశ్రమల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఢిల్లీలో జన్మించిన కమల్ ఖేరా (36) ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కెనడా పార్లమెంటుకు ఎన్నికయిన మహిళల్లో ఆమె అత్యంత పిన్న వయస్కురాలన్న గుర్తింపును ఇప్పటికే పొందారు. గత ప్రధాని జస్టిన్ ట్రూడో మంత్రివర్గంలోనూ వారిద్దరు పనిచేశారు. వేరే శాఖలను నిర్వహించారు. ప్రస్తుతం మంత్రి పదవులను మళ్లీ దక్కించుకున్న కొద్దిమందిలో వీరు ఉండడం విశేషం.