Share News

Pakistan: 214 మంది పాక్‌ సైనికులను చంపేశాం

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:18 AM

తమ వద్ద బందీలుగా ఉన్న మొత్తం 214 సైనికులను చంపేశామని, పాకిస్థాన్‌ ఆర్మీకి తామిచ్చిన గడువు ముగిసినందున ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. బీఎల్‌ఏ వద్ద బందీలుగా ఉన్న అందర్నీ విడుదల చేశామన్న పాక్‌ ఆర్మీ ప్రకటనను ఖండించింది.

Pakistan: 214 మంది పాక్‌ సైనికులను చంపేశాం

బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటన

ఇస్లామాబాద్‌, మార్చి 15: పాకిస్థాన్‌లో రైలును హైజాక్‌ చేసిన బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) సంచలన ప్రకటన చేసింది. తమ వద్ద బందీలుగా ఉన్న మొత్తం 214 సైనికులను చంపేశామని, పాకిస్థాన్‌ ఆర్మీకి తామిచ్చిన గడువు ముగిసినందున ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. బీఎల్‌ఏ వద్ద బందీలుగా ఉన్న అందర్నీ విడుదల చేశామన్న పాక్‌ ఆర్మీ ప్రకటనను ఖండించింది. ఈ మేరకు బీఎల్‌ఏ అధికార ప్రతినిధి జీయాంద్‌ బలోచ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘యుద్ధ ఖైదీల మార్పిడికి మేమిచ్చిన 48 గంటల గడువును పాక్‌ దళాలు పట్టించుకోలేదు. ఫలితంగా 214 సైనికులకు మరణ శిక్ష విధించాల్సి వచ్చింది’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Slap Fight: చెంపలు పగిలేగా కొట్టుకున్న బీజేపీ నేత, పోలీస్ ఆఫీసర్.. వీడియో వైరల్

DMK Leaders: హిందీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు.. డీఎంకే నేతల రియాక్షన్

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2025 | 03:19 AM