Share News

America Rejects : పాక్‌కు కొత్త ఆయుధాలేవీ

ABN , Publish Date - Oct 11 , 2025 | 04:42 AM

దాయాది దేశం పాకిస్థాన్‌కు అత్యాధునిక క్షిపణులు అందించేందుకు అమెరికా ఒప్పందం చేసుకుందంటూ వస్తున్న వార్తలను అగ్రరాజ్యం తోసిపుచ్చింది.....

America Rejects : పాక్‌కు కొత్త ఆయుధాలేవీ

  • ఇవ్వడం లేదు

  • క్షిపణుల విక్రయం వార్తలను ఖండించిన అమెరికా

    న్యూఢిల్లీ, అక్టోబరు 10: దాయాది దేశం పాకిస్థాన్‌కు అత్యాధునిక క్షిపణులు అందించేందుకు అమెరికా ఒప్పందం చేసుకుందంటూ వస్తున్న వార్తలను అగ్రరాజ్యం తోసిపుచ్చింది. ఇటీవల సవరించిన ఒప్పందం ప్రకారం పాక్‌కు అడ్వాన్స్‌డ్‌ మీడియం రేంజ్‌ ఎయిర్‌ టు ఎయిర్‌ మిస్సైల్స్‌ (ఏఎమ్‌ఆర్‌ఏఏఎంఎస్‌) అందించనుందనే ప్రచారాన్ని ఖండించింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా ఒప్పందం ప్రకారం పాకిస్థాన్‌ సహా అనేక దేశాలకు ఇప్పటికే ఉన్న ఆయుధాల నిర్వహణ, విడిభాగాలు అందిస్తామని మాత్రమే పేర్కొన్నట్టు తెలిపింది. పాక్‌కు కొత్తగా ఎలాంటి ఆయుధాలూ సరఫరా చేయబోమని స్పష్టం చేసింది. అమెరికా రక్షణ శాఖ సెప్టెంబరు 30న సవరించిన ఒప్పందాన్ని వెల్లడించింది. దీనిపై పాక్‌కు చెందిన డాన్‌ సహా అనేక పత్రికలు అమెరికా తమ దేశానికి కొత్త క్షిపణులు విక్రయించనున్నట్టు పేర్కొన్నాయి.

Updated Date - Oct 11 , 2025 | 06:03 AM