U.S. military : అమెరికా సైనికుల భోజనం నిధుల దారి మళ్లింపు!
ABN , Publish Date - Feb 17 , 2025 | 05:21 AM
అమెరికాలో సైనికుల ఆహారం కోసం కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు మిలటరీ డాట్ కాం కథనాన్ని ప్రచురించింది. ఆహారం కోసం ప్రతి నెలా ఒక్కో

వాషింగ్టన్, ఫిబ్రవరి 16: అమెరికాలో సైనికుల ఆహారం కోసం కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు మిలటరీ డాట్ కాం కథనాన్ని ప్రచురించింది. ఆహారం కోసం ప్రతి నెలా ఒక్కో సైనికుడి జీతం నుంచి 460 డాలర్లు (సుమారు రూ.40 వేలు) కోత విధిస్తారు. ఇలా జమ అయిన సొమ్మును భోజనాల కోసమే వినియోగించాల్సి ఉంటుంది. కానీ దానిని ఇతరత్రా మళ్లిస్తున్నట్టు తేలింది. జీతాల నుంచి 225 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,950 కోట్లు) వసూలు చేయగా, అందులో కేవలం 74 మిలియన్ డాలర్లు (సుమారు రూ.640 కోట్లు) మాత్రమే ఆహారం కోసం ఖర్చు చేశారు. దేశంలోని 11 పెద్ద మిలటరీ బేస్‌ల్లో గత ఏడాది చేసిన వ్యయాలను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడయింది. నిధుల మళ్లింపు కారణంగానే ఫోర్ట్ కార్సన్, కొలరాడ్లోని మిలటరీ కేంద్రాల్లో ఆహార కొరత ఉందని వార్తలు కూడా వచ్చాయి.