US airstrike: యెమెన్ జైలుపై అమెరికా దాడి.. 68మంది మృతి
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:46 AM
యెమెన్‌లో సాదా రాష్ట్రంలోని జైలు పై అమెరికా జరిపిన వైమానిక దాడిలో 68 మంది మృతి చెందగా, 47 మంది గాయపడ్డారు. హౌతీ తిరుగుబాటుదారులు ఈ దాడులను అమెరికా జరిపిందని ఆరోపించారు.
దుబాయి, ఏప్రిల్ 28: యెమెన్ జైలుపై అమెరికా జరిపిన వైమానిక దాడిలో 68 మంది మరణించగా 47 మంది గాయపడ్డారు. యెమెన్‌లోని సాదా రాష్ట్రంలో అమెరికా వైమానిక దాడులు చేసిందని హౌతీ తిరుగుబాటుదారులు ఆరోపించారు. ఆఫ్రికన్ వలసదారులు ఉన్న జైలులో ఈ దాడులు జరిగాయన్నారు. ఇందులో 68 మంది మృతిచెందగా 47 మంది గాయపడ్డారని వెల్లడించారు. ఈ జైలులో 115 మంది ఖైదీలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. యెమెన్ రాజధాని సనాలో కూడా అమెరికా వైమానిక దాడులు జరిపిందని, ఈ దాడుల్లో ఎనిమిది మంది మరణించారని హౌతీలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
For National News And Telugu News