Share News

Barbell Accident In Gym: జిమ్‌లో వర్కవుట్లు చేసే వారికి హెచ్చరిక.. ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త..

ABN , Publish Date - Dec 06 , 2025 | 07:35 PM

55 ఏళ్ల మాంటెనెగ్రో అనే వ్యక్తి జిమ్‌లో బార్‌బెల్‌తో చెస్ట్ ప్రెస్ వర్కవుట్ చేస్తూ ఉన్నాడు. బార్‌బెల్ చేతుల నుంచి జారి రొమ్ములపై పడింది. బార్‌బెల్ చాలా బరువుగా ఉండటంతో గుండె ఆగిపోయింది.

Barbell Accident In Gym: జిమ్‌లో వర్కవుట్లు చేసే వారికి హెచ్చరిక.. ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త..
Barbell Accident In Gym

బాడీ బిల్డింగ్ చేయడానికి కావచ్చు.. ఫిట్‌గా ఉండటానికి కావచ్చు. యువకుల దగ్గరినుంచి ముసలి వారి వరకు జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జిమ్‌లలో ప్రమాదాలు చోటుచేసుకోవటం బాగా పెరిగింది. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు సైతం పోతున్నాయి. తాజాగా, బ్రెజిల్‌లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. బార్‌బెల్ గుండెలపై పడ్డంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


55 ఏళ్ల మాంటెనెగ్రో అనే వ్యక్తి ఒలిండాలోని ‘పాలాసియో దాస్ బొనేకోస్ జిగాంటెస్’ అనే మ్యూజియానికి ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. ఆయన ఫిట్‌గా ఉండటానికి ప్రతీరోజూ జిమ్‌కు వెళుతూ ఉన్నాడు. రోజూలానే డిసెంబర్ 1వ తేదీన కూడా జిమ్‌కు వెళ్లాడు. జిమ్‌లో బార్‌బెల్‌తో చెస్ట్ ప్రెస్ వర్కవుట్ చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఊహించని సంఘటన చోటుచేసుకుంది. బార్‌బెల్ చేతుల నుంచి జారి రొమ్ములపై పడింది. బార్‌బెల్ చాలా బరువుగా ఉండటంతో గుండె ఆగిపోయింది. అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమించిన అక్కడి వారు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు.


మాంటెనెగ్రోను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. మాంటెనెగ్రో మరణంపై జిమ్ యజమాన్యం సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘సంఘటన జరిగిన వెంటనే వైద్య సాయం అందించాం. హుటాహుటిన ఆస్పత్రికి తరలించాము. అయినా లాభం లేకుండా పోయింది. ఆయన చనిపోయారు. ఇది మాకెంతో బాధకలిగించింది. ఆయన కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి’ అని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

భట్టి విక్రమార్కతో చిరంజీవి, నాగార్జున కీలక భేటీ

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. అగ్ని ప్రమాదంలో..

Updated Date - Dec 06 , 2025 | 08:38 PM