Islamic Culture: దుబాయిలో 6 మాసాల్లో 3,600 మంది ఇస్లాం స్వీకరణ
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:30 AM
దుబాయిలో ఈ ఏడాది మొదటి ఆరు నెలల వ్యవధిలో 3,600 మంది ఇస్లాం మతాన్ని స్వీకరించగా..
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): దుబాయిలో ఈ ఏడాది మొదటి ఆరు నెలల వ్యవధిలో 3,600 మంది ఇస్లాం మతాన్ని స్వీకరించగా, మరో 1300మంది ఇస్లాం విజ్ఞాన విద్యలో తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఇక్కడి ప్రభుత్వం వెల్లడించింది. అంటే సగటున రోజుకు 19 మంది మతాన్ని స్వీకరించారని తెలిపింది. దుబాయి ప్రభుత్వ ఇస్లామిక్ సంస్కృతి, దాన ధార్మిక శాఖ ఆధ్వర్యంలో నడిచే మొహ్మద్ బిన్ రాషేద్ ఇస్లామిక్ సాంస్కృతిక కేంద్రాన్ని ఉటంకిస్తూ.. ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ఇస్లాం మహోన్నత విలువలను తెలియజేస్తూ పరమత సహన విలువలను తమ సంస్థ ప్రచారం చేస్తుందని దాని సంచాలకుడు జాసిం అల్ ఖరాజీ చెప్పారు. నాగరికత మధ్య సాంస్కృతిక వారధిగా, ఇస్లాంలోని సహనం, విజ్ఞానం, పరస్పర అవగాహన అంశాలకనుగుణంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు.