Share News

Restaurant Fire: రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం.. 22 మంది మృతి..

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:06 PM

Restaurant Fire: హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ సిబ్బంది గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. అగ్ని మాపక దళాలు మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. పోలీసులు చనిపోయిన 22 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపారు.

Restaurant Fire: రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం.. 22 మంది మృతి..
Restaurant Fire

బీజింగ్‌: చైనాలోని లియానింగ్ ప్రావిన్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్లో మంటలు చెలరేగటంతో 22 మంది చనిపోగా .. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. చైనా అధికార మీడియా క్లిన్‌క్షువ న్యూస్ తెలిపిన వివరాల మేరకు.. చైనా, లియానింగ్ ప్రావిన్స్‌లోని ఐయావోయాంగ్ సిటీలో ఓ ప్రముఖ రెస్టారెంట్ ఉంది. మంగళవారం మధ్యాహ్నం 12.25 గంటల ప్రాంతంలో ఆ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.


అగ్ని మాపక దళంతో పాటు రెస్క్యూ టీమ్‌కు కూడా సమాచారం వెళ్లింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ సిబ్బంది గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. అగ్ని మాపక దళాలు మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. పోలీసులు చనిపోయిన 22 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపారు. ఇక, ఈ సంఘటనపై చైనా అధ్యక్షుడు క్షి జిన్‌పింగ్ స్పందించారు. గాయపడ్డవారికి సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. అయితే, రెస్టారెంట్లో మంటలు చెలరేగడానికి కారణం ఏంటన్నది తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

The Family Man: ఫ్యామిలీ మ్యాన్ నటుడి అనుమానాస్పద మృతి

Actress: నటి ఇంట్లో భారీ చోరీ.. 34 లక్షల నగలు దోచేసిన పని మనిషి..

Updated Date - Apr 29 , 2025 | 04:06 PM