Share News

Canada: కెనడా వెళ్లారు... కాలేజీల్లో చేరలేదు!

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:09 AM

భారత్‌ నుంచి గతేడాది దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లారు.

Canada: కెనడా వెళ్లారు... కాలేజీల్లో చేరలేదు!

రిపోర్టు చేయని 20వేల మంది భారత విద్యార్థులు

అట్టవా, జనవరి 17: భారత్‌ నుంచి గతేడాది దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లారు. అయితే వీరిలో సుమారు 20వేల మంది అక్కడి కాలేజీల్లో రిపోర్టు చేయలేదనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ఆ దేశంలో ఉన్న మొత్తం భారత విద్యార్థుల్లో 5.4 శాతానికి సమానం. కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ శాఖ(ఐఆర్‌సీసీ) నివేదిక ప్రకారం.. 2024 మార్చి, ఏప్రిల్‌ నెలల్లో దాదాపు 50వేల మంది అంతర్జాతీయ విద్యార్థులు స్టడీ పర్మిట్లు జారీ అయిన తర్వాత కూడా కళాశాలలకు హాజరు కాలేదు. వీరిలో భారతీయ విద్యార్థులే అధికంగా ఉన్నా. కాగా, చైనా నుంచి వచ్చిన వారిలో 6.4శాతం, ఫిలిప్పీన్స్‌ నుంచి 2.2శాతం మంది విద్యార్థులు కాలేజీల్లో చేరలేదని తేలింది.

Updated Date - Jan 18 , 2025 | 05:09 AM