Share News

Digestive Mistakes: ఈ ఆహారాలు తీసుకున్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?.. అయితే జాగ్రత్త..

ABN , Publish Date - Oct 30 , 2025 | 02:58 PM

మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే జీర్ణ వ్యవస్థ విషయంలో చాలా కచ్చితంగా ఉండాలి. ఈ ఐదు ఆహార పదార్ధాలను తీసుకున్న వెంటనే నీళ్లు అస్సలు తాగకూడదు.

Digestive Mistakes: ఈ ఆహారాలు తీసుకున్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?.. అయితే జాగ్రత్త..
Digestive Mistakes

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. మనకు ఎంతో సాధారణంగా అనిపించే ఆహారపు అలవాట్లు కూడా భారీ మూల్యాన్ని కోరుకుంటాయి. మరీ ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ విషయంలో చాలా కచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఐదు ఆహార పదార్ధాలను తీసుకున్న వెంటనే నీళ్లు అస్సలు తాగకూడదు. తిన్న ఆహారాన్ని బట్టి 30 నిమిషాల నుంచి గంట వరకు నీటిని తాగకూడదు. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.


బొప్పాయి పండు

బొప్పాయి పండులో 90 శాతం నీళ్లు ఉంటాయి. బొప్పాయి పండును తిన్న వెంటనే నీటిని తాగితే పొట్టలోని జీర్ణ రసాలపై ప్రభావం చూపుతుంది. తద్వారా అరుగుదల మందగిస్తుంది. అందుకే బొప్పాయి తిన్న తర్వాత 40 నుంచి 50 నిమిషాల వరకు నీటిని తీసుకోకూడదు.

అరటి పండు

అరటి పండులో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అరటి పండు తిన్న వెంటనే నీళ్లు తాగితే అరుగుదల సమస్యలు వస్తాయి. అందుకే అరటి పండు తిన్న తర్వాత కనీసం అరగంట పాటు నీటిని తాగకూడదు.


సిట్రస్ కలిగిన పండ్లు

పుల్లటి పండ్లు మన పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. సిట్రస్ పళ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే యాసిడ్స్ డైల్యూట్ అవుతాయి. పీహెచ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. తద్వారా గ్యాస్, జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. అందుకే సిట్రస్ కలిగిన పండ్లు తిన్న తర్వాత 30 నిమిషాల వరకు నీటిని తాగకూడదు.

పల్లీలు (వేరు శనగ)

పల్లీలలో ఫ్యాట్, ప్రొటీన్ అధికంగా ఉంటాయి. వీటిని తిన్న వెంటనే నీటిని తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. అందుకే పల్లీలు తిన్న 20 నుంచి 30 నిమిషాల తర్వాతే నీటిని తాగాలి.

పాలు

పాలను తాగిన వెంటనే నీటిని తాగితే పొట్టలోని యాసిడ్స్ ప్రభావం తగ్గుతుంది. మెటబాలిజంపై ప్రభావం పడుతుంది. పొట్టలో ఎసిడిటీ పెరుగుతుంది. అందుకే పాలు తాగిన తర్వాత అరగంట వరకు నీటిని తాగకూడదు.


ఇవి కూడా చదవండి

సౌతాఫ్రికా కెప్టెన్ సరికొత్త రికార్డు

భార్యలో ఈ లక్షణాలు ఉంటే.. ఆమె భర్త సంతోషంగా ఉంటాడు.!

Updated Date - Oct 30 , 2025 | 03:06 PM