Share News

Walking Benefits: రోజుకు 7,000 అడుగులు.. ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు.!

ABN , Publish Date - Jul 25 , 2025 | 05:03 PM

రోజుకు 7,000 అడుగులు నడిస్తే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని తాజా అధ్యయనం చెబుతోంది. అయితే, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Walking Benefits:  రోజుకు 7,000 అడుగులు.. ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు.!
Walking

ఇంటర్నెట్ డెస్క్: రోజుకు కేవలం 7,000 అడుగులు నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని లాన్సెట్ పబ్లిక్ హెల్త్ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం, నడక వల్ల శరీరానికే కాదు మనస్సుకు కూడా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ అధ్యయనం ప్రకారం, రోజుకు 7,000 అడుగులు నడిస్తే మొత్తం మరణ ప్రమాదం 47% తగ్గుతుంది. డిమెన్షియా వచ్చే అవకాశం 38% తక్కువగా ఉంటుంది.


2014 నుండి 2025 మధ్యకాలంలో ప్రచురితమైన 88 ప్రముఖ అధ్యయనాల డేటాను పరిశీలించారు. మొత్తం 1.6 లక్షల మందికి పైగా పెద్దవారి జీవన శైలిని విశ్లేషించారు. ఇది నడక ఆరోగ్యంపై ఇంత వరకు జరిగిన పరిశోధనల్లోనే అత్యంత సమగ్ర అధ్యయనం అని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ అధ్యయనం ప్రకారం, రోజుకు 7,000 అడుగులు నడవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 6% తక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు 25%, టైప్ 2 డయాబెటిస్ 14% తక్కువగా ఉంటుంది. 7,000 అడుగులు నడవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు. ముఖ్యంగా చురుకుగా లేని పెద్దవారికి ఇది మరింత ప్రాయోజనకరమని అంటున్నారు.


రోజుకు 7,000 అడుగులు నడవడం వల్ల:

  • మీ శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది

  • మనోస్థితి స్థిరంగా ఉంటుంది

  • దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గుతుంది

  • జీవన నాణ్యత మెరుగవుతుంది

అందుకే… రోజూ నడకకు కొద్దిపాటి సమయం కేటాయించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

రోజూ ఈ 5 పనులు చేస్తే.. 90% సమస్యలు సాల్వ్..

పదే పదే జుట్టు దువ్వడం వల్ల పురుషులకు బట్టతల వస్తుందా?

For More Health News

Updated Date - Jul 25 , 2025 | 05:06 PM