Sugar: మీకు చక్కెర ఎక్కువగా తినే అలవాటు ఉందా.. జాగ్రత్త..
ABN , Publish Date - May 29 , 2025 | 01:12 PM
కొంతమంది చక్కెరను అదే పనిగా తింటుంటారు. అయితే, ఈ అలవాటు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పురుషులు చక్కెరను ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.
Sugar: చక్కెర చాలా ప్రాసెసింగ్ ద్వారా తయారవుతుంది. దీనికి అనేక రకాల రసాయనాలు కలుపుతారు. కాబట్టి, ఒక రోజులో 20 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తినకూడదని నిపుణులు చెబుతారు. అయితే, కొంతమంది మాత్రం చక్కెరను అదే పనిగా తింటుంటారు. అయితే, ఈ అలవాటు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పురుషులు చక్కెరను ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.
ఊబకాయం
చక్కెర ఎక్కువగా తింటే చాలా సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, ఇది కార్బోహైడ్రేట్. చక్కెర రక్తంలో త్వరగా కరిగి గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ శక్తి కొవ్వుగా మారి ఊబకాయం వచ్చేలా చేస్తుంది. ఇక ఊబకాయం వస్తే అన్నీ రోగాలు క్యూ కడతాయి. అందుకే నిపుణులు చక్కెర ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు.
ఒక పరిశోధనలో చక్కెర ఎక్కువగా తింటే పురుషుల లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని తేలింది. 75 గ్రాముల చక్కెరను రెండు గంటల పాటు తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు 25 శాతం తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. చక్కెర ఎక్కువగా తింటే లైంగిక సామర్థ్యం 2 గంటల్లోనే బలహీనపడుతుందని అంటున్నారు. గ్లూకోజ్ తీసుకోవడం వల్ల పురుషులలో మొత్తం టెస్టోస్టెరాన్ స్థాయిలు గణనీయంగా తగ్గాయని పరిశోధనలు సూచించాయి.
Also Read:
ఇకపై ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులూ పైలట్స్ కావచ్చు.. ఎలాగంటే..
తాళి కట్టే ముందు వింత ఘటన.. వధువు అనుమతి తీసుకుని మరీ..
For More Lifestyle News