Boiled Egg vs Omelet : బరువు తగ్గాలంటే ఏది బెటర్? బాయిల్డ్ ఎగ్ Vs ఆమ్లెట్
ABN , Publish Date - Sep 10 , 2025 | 08:39 PM
బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సమస్య. ఈ లక్ష్యాలను అందుకోవాలనే వారిలో ఎగ్స్ ఒక ముఖ్య ఆహారం. అయితే, బాయిల్డ్ ఎగ్స్ లేదా ఆమ్లెట్ ఏది తింటే బెటర్ అనే సందేహం అందరిలోనూ ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్ : బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సమస్య. స్థూలకాయం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్న నేపథ్యంలో వెయిట్ లాస్ అవ్వడానికి జనం ప్రాధాన్యమిస్తున్నారు. ఈ లక్ష్యాలను అందుకోవాలనే వారిలో ఎగ్స్ (Eggs) ఒక ప్రముఖ ఆహారంగా ఉన్నాయి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. కొవ్వు తగ్గించడంలో ఎగ్స్ సహాయపడతాయి.
అయితే, బరువు తగ్గడానికి బాయిల్డ్ ఎగ్స్ (Boiled Eggs) లేదా ఆమ్లెట్ (Omelette) ఏది తింటే బెటర్ అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. బాయిల్డ్ ఎగ్స్ బెటర్ అంటూ నివేదికలు చెబుతున్నాయి. ఉడకబెట్టిన కోడి గుడ్లు తినడమే ఉత్తమ ఎంపిక అని చెబుతున్నారు. ఒక బాయిల్డ్ ఎగ్‌లో సుమారు 78 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇది కేలరీలను నియంత్రించాలనుకునే వారికి మంచిది. అంతేకాక, ఎగ్ లోని ప్రోటీన్ (సుమారు 6-7 గ్రాములు ఒక ఎగ్‌లో) ఉండి ఆకలిని తగ్గిస్తుంది.
బాయిల్డ్ ఎగ్ ఆహారంగా ఎంచుకోవడం వల్ల అదనపు కొవ్వు తగ్గుతుంది. సులభంగా సిద్ధం చేయగలిగే ఆహారం ఇది. ఆయిల్ ఉండకపోవడం వల్ల గుండెకు మంచిది. రోజుకి ఒకటి లేదా రెండు బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడం ఆరోగ్యకరం.
అయితే, ఆమ్లెట్‌ను కూడా వెయిట్ లాస్‌లో భాగంగా చేర్చుకోవచ్చు. కానీ తక్కువ ఆయిల్, ఆరోగ్యకరమైన పదార్థాలతో సిద్ధం చేయాలి. రోజువారీ డైట్‌లో సమతుల్యతను కాపాడుకుని, వ్యక్తిగత ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఉండాలి. డైట్ ప్లాన్ కోసం న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించడం మరింత మేలు చేస్తుంది.