Asthma: ఆస్తమా రోగులు ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నిర్లక్ష్యం చేస్తే ఇన్హేలర్ కూడా పనిచేయదు..
ABN , Publish Date - May 25 , 2025 | 05:08 PM
ఆస్తమాతో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా, ఆస్తమా రోగులు ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆస్తమా అనేది శ్వాసకోశ వ్యాధి. ఒకరికి ఆస్తమా ఉన్నప్పుడు, వాయునాళం కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఆస్తమా రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సరికాని ఆహారం తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఆస్తమాతో బాధపడేవారు ఏలాంటి ఆహారా పదార్ధాలు తీసుకోవడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..
పాల ఉత్పత్తులు
ఆస్తమాతో బాధపడేవారు పాలు, జున్ను, ఐస్ క్రీం వంటి పాల ఉత్పత్తులను తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. పాల ఉత్పత్తులలోని ప్రోటీన్, కొవ్వు.. శరీరంలో శ్లేష్మం పెరగడానికి కారణమవుతాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం వల్ల ఆస్తమా ప్రమాదం పెరుగుతుంది.
ప్యాక్ చేసిన ఆహారాలు
చిప్స్, ప్యాక్ చేసిన నూడుల్స్, ఫ్రోజెన్ ఫుడ్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఆస్తమా సమస్య పెరుగుతుంది. ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం వల్ల అలెర్జీలు, వాపు సమస్య పెరుగుతుంది. కాబట్టి, వీటిని తీసుకోవడం మంచిది కాదు.
నూనె ఆహారాలు
సమోసా, పకోడి, ఫ్రైడ్ చికెన్ వంటి నూనె పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో వాపు పెరుగుతుంది. ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల ఆస్తమా సమస్య పెరుగుతుంది. నూనె పదార్థాలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది.
శీతల పానీయాలు
స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, శీతల పానీయాలు వంటి తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆస్తమా ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, ఇలాంటి వాటిని తినడం మంచిది కాదు.
Also Read:
చెవిలో గులిమి.. ఈ 5 ఇంటి నివారణలతో శుభ్రం చేసుకోండి..
షుగర్ కంట్రోల్ కావాలంటే కాకరకాయ ఇలా తినండి..
For More Health News