UGC NET December 2025: యూజీసీ నెట్ డిసెంబర్ 2025 రిజిస్ట్రేషన్ షురూ.. ఇలా దరఖాస్తు చేసుకోండి
ABN , Publish Date - Oct 08 , 2025 | 08:25 PM
ఉన్నత విద్యాసంస్థల్లో అకడమిక్, రీసెర్చ్ కెరీర్ ఆశించే పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈసారి 8 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటారని ఎన్‌టీఏ అంచనా వేస్తోంది. అభ్యర్థులు కచ్చితమైన విద్యార్హతల వివరాలు సమర్పించాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.
న్యూఢిల్లీ: యూజీసీ నెట్ డిసెంబర్ 2025 (UGC NET December 2025) రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రారంభించింది. దేశంలోని యూనివర్శిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్, జూనియర్ రీసెర్ట్ ఫెలోషిప్ (JRF) కోసం అర్హతను సాధించేందుకు జాతీయ స్థాయిలో ఈ పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు పూర్తి చేసి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. గడువుకు ముందే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఉన్నత విద్యాసంస్థల్లో అకడమిక్, రీసెర్చ్ కెరీర్ ఆశించే పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈసారి 8 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటారని ఎన్‌టీఏ అంచనా వేస్తోంది. అభ్యర్థులు కచ్చితమైన విద్యార్హతల వివరాలు సమర్పించాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.
తేదీలు, దరఖాస్తు ప్రక్రియ
యూడీసీ నెట్ డిసెంబర్ 2025 కోసం అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.inలో రిజిస్ట్రేషన్ విండోను తెరిచారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు, సబ్జెక్ట్ ప్రాధాన్యతలు, పరీక్షా కేంద్రం సిటీని ఆన్‌లైన్‌లో సెలక్షన్ చేసుకోవాలి. వివరాలు సమర్పించిన తర్వాత స్కాన్ చేసిన ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ రుసుము చెల్లించి కన్ఫర్‌మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆఫ్ లైన్ దరఖాస్తులను ఎంతమాత్రం స్వీకరించరు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కరెక్షన్ విండో కొద్దిసేపు తెరుస్తారు. ఇందువల్ల ఫైనల్ సబ్మిషన్‌కు ముందు తప్పులు సరిచేరుకునే వీలు అభ్యర్థులకు కలుగుతుంది.
అవసరమైన డాక్యుమెంట్లు ఇవే..
ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేసే ముందు అభ్యర్థులు సిద్ధంగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్లు ఇవే..
-ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డు, పాస్‌పార్ట్, లేదా ఓటర్ ఓడీ
-మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్ లేదా మార్క్ షీట్స్ (ఎలిజిబిలిటీ ప్రూఫ్)
-కేటగిరి సర్టిఫికెట్లు (ఎస్‌సీ/ఎస్టీ/ఓసీసీ-ఎన్‌సీఎల్/ఈడబ్ల్యూఎస్)
-పీడ్ల్యూడీ సర్టిఫెకెట్ (నిర్దిష్ట వైకల్యంతో ఉన్నట్టు ధ్రువీకరించే పత్రం)
-రీసెంట్‌గా తీయించుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ (సైజు, రిజల్యూషన్ లిమిట్స్‌తో స్కాన్ చేసిన ఫోటో)
-సంతకం (స్కానింగ్) నిర్దిష్ట ఫార్మెట్‌లో ఉండాలి
-కమ్యూనికేషన్ కోసం ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్
-పేమెంట్ వివరాలు, ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ (ఫీజు సమర్పణ తరువాత)
అప్లికేషన్ ఫీజు వివరాలు
ఎన్‌టీఏ బులిటెన్ సమాచారం ప్రకారం అప్లికేషన్ ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్/అన్ రిజర్వ్‌డ్ కేటగిరి అభ్యర్థులు రూ.1,150 చెల్లించాలి. ఓబీసీ-ఎన్‌సీఎల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.325 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించారు. డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. ఫీజు చెల్లించడం సక్సెస్‌పుల్‌గా ముగియగానే అభ్యర్థులు తప్పనిసరిగా ఫీజు రసీదు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు తిరిగి ఇవ్వడం జరుగదు.
పరీక్షా సరళి, అర్హతలు
యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించి రెండు పేపర్లు ఉంటాయి. వీటిని ఒకే సింటింగ్‌లో (3 గంటల వ్యవధి) నిర్వహిస్తారు. పేపర్-1లో జనరల్ టీచింగ్, రీసెర్చ్ ఆప్టిట్యూట్, పేపర్-2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌పై ప్రశ్నలు ఉంటాయి. విద్యార్హతల పరంగా అభ్యర్థులు తప్పనిసరిగా 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరికి 50 శాతం ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకునే వీలుంది.
ఇవి కూడా చదవండి..
పార్ట్‌టైమ్ కోర్సుల నిర్వహణలో.. జేఎన్‌టీయూ నత్తనడక
మీ టెన్త్ సర్టిఫికెట్‌లో తప్పులున్నాయా? ఇలా మార్చుకోండి..
Read Latest Telangana News and National News