SBI PO Mains Exam Results 2025: ఎస్‌బీఐ పీవో మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ABN , Publish Date - Nov 06 , 2025 | 06:45 PM
ప్రోబేషనరీ ఆఫీసర్స్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గురువారం విడుదల చేసింది.
న్యూఢిల్లీ, నవంబర్ 06: ప్రోబేషనరీ ఆఫీసర్స్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గురువారం విడుదల చేసింది. ఈ ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలో విడుదల చేసింది. దీంతో ఈ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులు.. చివరి రౌండ్‌కు అర్హత సాధించినట్లు అయింది. సెప్టెంబర్ 13వ తేదీన మొత్తం 541 పోస్టులకు ఈ పీవో పరీక్షను ఎస్‌బీఐ నిర్వహించింది. ఈ పరీక్షల ద్వారా 500 రెగ్యులర్, 41 బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయనుంది. అయితే ప్రిలిమినరి పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులు.. ఈ తుది జాబితాలో పరిగణించబోమని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఆగస్ట్ 4, 5 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులు.. మెయిన్స్ పరీక్షలకు ఎంపికయ్యారు.
అయితే sbi.co.inలో ఈ ఫలితాలను ఇలా దశల వారిగా చూసుకోవాలి..
1 : అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలోకి వెళ్లాలి.
2: SBIలోని కెరీర్లు విభాగాన్ని సెలెక్ట్ చేయాలి.
3: కరెంట్ ఓపెనింగ్స్‌పై క్లిక్ చేయాలి.
4 : SBI PO రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌ను సెలెక్ట్ చేయాలి.
5:MainResultపై క్లిక్ చేయాలి.
6: మీ లాగిన్స్ అందులో ఎంటర్ చేయాలి.
7: అనంతరం సబ్‌మీట్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఫలితాలు వస్తాయి.
ఈ మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు త్వరలో పంపుతామని ఎస్‌బీఐ వెల్లడించింది. అలాగే అదనపు సమాచారం ఏదైనా ఉంటే.. ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా వ్యక్తిగతంగా తెలియజేస్తామని పేర్కొంది.