Share News

Sarkari Result 2025: ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ ఫలితాల విడుదల

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:22 PM

ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ గ్రేడ్ - 1సీబీటీ పరీక్ష రాసిన అభ్యర్థులకు కీలక అప్‌‌డేట్. ఈ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అభ్యర్థులు సంబంధిత ఆర్ఆర్‌బీల అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Sarkari Result 2025: ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ ఫలితాల విడుదల

ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ గ్రేడ్ - 1 సీబీటీ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను సంబంధిత రీజినల్ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. గతేడాది డిసెంబర్ 19 నుంచి 20 మధ్య సీబీటీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ప్రొవిజనల్ ఆన్సర్ కీని డిసెంబర్ 26న విడుదల చేసి వాటిపై మరో ఐదు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది. తాజాగా ఫలితాలు విడుదల చేసింది. ఇక పరీక్షలో ఉత్తీర్ణులైన వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

JNTU: జేఎన్‌టీయూ స్నాతకోత్సవం వాయిదా..


ఈ-కాల్ లెటర్‌లో పేర్కొన్న వెన్యూలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. షెడ్యూల్ ఖరారైన తరువాత సంబంధిత వివరాలను ఈమెయిల్, ఎస్‌ఎమ్ఎస్, వెబ్‌సైట్‌‌ నోటిఫికేషన్‌లో పేర్కొంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తరువాత అభ్యర్థులు మెడికల్ ఎగ్జామినేషన్‌ కోసం రైల్వే ఆసుపత్రల్లో హాజరు కావాల్సి ఉంటుంది.

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ - 1 సీబీటీ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

  • సంబంధిత ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో ‘ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ 1 సీబీటీ రిజల్ట్ 2024’ లింక్‌పై క్లిక్ చేయాలి

  • మరో పేజీలో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ రోల్ నెంబర్‌తో కూడిన విషయాలు ప్రదర్శితమవుతాయి.

  • ఆ ఫైల్ డౌన్ లోడ్ చేసుకుని ఫలితాలు చెక్ చేసుకోవచ్చు


PGCIL Vacancies 2025:పరీక్ష లేకుండా పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు..నెలకు రూ.2.20 లక్షల జీతం..వెంటనే దరఖాస్తు చేసుకోండి

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్ఆర్‌బీ మొత్తం 9144 టెక్నీషియన్ పోస్టులను భర్త చేయదలిచిన విషయం తెలిసిందే. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు 1092 పోస్టులు, గ్రేడ్ 3 టెక్నీషియన్ పోస్టులు 8052 ఉన్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల కోసం అభ్యర్థులు సంబంధిత ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Read Latest Telugu and Education News

Updated Date - Mar 13 , 2025 | 04:38 PM