Share News

Degree certificates: బాబోయ్‌... ఎన్ని డిగ్రీలో...

ABN , Publish Date - Nov 16 , 2025 | 01:07 PM

గమ్మత్తేమిటంటే... ఈ 60 ఏళ్ల మాస్టర్‌గారు 1981లో బొటాబొటి మార్కులతో తొలిసారి డిగ్రీ పాసయ్యారు. ఆ మార్కులు చూసి అతడి తల్లి చాలా బాధపడిందట. దాంతో ‘టాప్‌ మార్కులు తెచ్చుకుంటాన’ని ఆమెకు వాగ్దానం చేశాడు. అప్పటి నుంచి ఇష్టంతో చదవడం మొదలెట్టాడు.

Degree certificates: బాబోయ్‌... ఎన్ని డిగ్రీలో...

ఒక్క డిగ్రీ చదవడానికే ఆపసోపాలు పడుతుం టారు చాలామంది. అలాంటిది అలవోకగా 150కి పైగా డిగ్రీలు సాధించాడంటే ‘ఎవరా మేధావి’ అనకుండా ఉండలేరు. ఆయనే... పార్థిబన్‌. చెన్నైకు చెందిన ఆయన గారు వృత్తిరీత్యా ప్రొఫెసర్‌. అందరూ ముద్దుగా ‘డిగ్రీల భాండాగారం’, ‘వాకింగ్‌ ఎన్‌సైక్లోపీడియా’ అని పిలుస్తారు.

గమ్మత్తేమిటంటే... ఈ 60 ఏళ్ల మాస్టర్‌గారు 1981లో బొటాబొటి మార్కులతో తొలిసారి డిగ్రీ పాసయ్యారు. ఆ మార్కులు చూసి అతడి తల్లి చాలా బాధపడిందట. దాంతో ‘టాప్‌ మార్కులు తెచ్చుకుంటాన’ని ఆమెకు వాగ్దానం చేశాడు. అప్పటి నుంచి ఇష్టంతో చదవడం మొదలెట్టాడు. క్రమక్రమంగా ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వడం నుంచి ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకునే స్థాయికి ఎదిగారు.


ఆ తర్వాత డిగ్రీ పట్టా అందుకోవడం ఆయనకు ఓ అభిరుచిగా మారింది. నాలుగు దశబ్దాలుగా పుస్తకాలతోనే సావాసం చేస్తూ... ఎకనామిక్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, లా వంటి అంశాల్లో బోలెడు మాస్టర్‌ డిగ్రీలు చేశారు. వాటితో పాటు 12 ఎమ్‌ఫిల్‌ డిగ్రీలు, 20 ప్రొఫెషనల్‌ కోర్సులు, 11 సర్టిఫికెట్‌ కోర్సులు, 9 పీజీ డిప్లొమో కోర్సుల్లో పట్టా సాధించారు. ప్రస్తుతం నాల్గవ పీహెచ్‌డీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. తన సంపాదనలో 90 శాతం కాలేజీ ఫీజులు, బుక్స్‌, ఎగ్జామ్‌ ఫీజులకే ఖర్చు చేసున్నారట. ‘తన తదుపరి లక్ష్యం 200 డిగ్రీల మైలురాయిని పూర్తి చేయడం’ అని గర్వంగా చెప్పుకుంటున్నారీ ప్రొఫెసర్‌ సాబ్‌.

Updated Date - Nov 16 , 2025 | 01:07 PM