Job Mela: కింగ్స్ ప్యాలెస్‌లో జాబ్ మేళా.. ఎప్పుడంటే..
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:21 PM
హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో కింగ్స్ ప్యాలెస్‌లో జాబ్ మేళ నిర్వహించనున్నారు. వివిధ సంస్థలు ఈ జాబ్ మేళలో పాల్గొనున్నాయి.
హైదరాబాద్, జూన్ 19: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు నిర్వాహాకులు మన్నన్ ఖాన్ వెల్లడించారు. జూన్ 21వ తేదీ అంటే.. శనివారం మెహదీపట్నంలోని కింగ్స్ ప్యాలెస్‌లో ఈ జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వహించే ప్రదేశం పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 67 వద్ద ఉందన్నారు. ఈ మేళ ద్వారా చాలా మంది మంచి ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశముందని పేర్కొన్నారు.
ఈ మేళలో అనేక కంపెనీలు పాల్గొంటాయని వివరించారు. ఆ జాబితాలో ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, విద్య, బ్యాంకింగ్ తదితర సంస్థలు ఉన్నాయని చెప్పారు. అయితే కొన్ని కంపెనీలు ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని అందించనున్నాయన్నారు. పదో తరగతి అర్హత నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవి వారు వరకు అంతా ఈ మేళకు హాజరు కావచ్చునని తెలిపారు.
అలాగే ఈ మేళ సమయంలో.. కంపెనీలు ఆన్ సైట్‌లో ప్రాథమిక ఇంటర్వ్యూలను నిర్వహిస్తాయన్నారు. ఇది అభ్యర్థులు తమ ఉద్యోగ దరఖాస్తులపై త్వరితగతిన అభిప్రాయాన్ని పొందేందుకు సహాయపడుతుందని వివరించారు. ఈ ఉద్యోగ మేళాకు ప్రవేశం ఉచితమన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించకుండా లేదా ముందస్తుగా పేరు నమోదు చేసుకోకుండా సైతం ఈ మేళాకు హాజరు కావచ్చునని తెలిపారు. మరిన్ని వివరాలు లేక సందేహాల కోసం.. 8374315052కు కాల్ చేయవచ్చునని అభ్యర్థులకు మన్నన్ ఖాన్ సూచించారు.
ఈ వార్తలు కూడ చదవండి..
విదేశాలకు విమానం బ్లాక్ బాక్స్..!
For More Education News and Telugu News