Share News

ఆ ఎనిమిది మంది!

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:57 AM

అది ఊటనీరు కాదు కన్నీరు వరద కాదు రాజకీయ బురద. ఒక్కక్షణంలో పోయిన ప్రాణాలు కావవి, ఎంత సమయం విలవిలలాడాయో!...

ఆ ఎనిమిది మంది!

అది ఊటనీరు కాదు

కన్నీరు

వరద కాదు

రాజకీయ బురద.

ఒక్కక్షణంలో పోయిన

ప్రాణాలు కావవి,

ఎంత సమయం

విలవిలలాడాయో!

ఏ తల్లి కన్న బిడ్డలో

ఏ ఊరి మట్టిగడ్డలో

ఇక్కడ

అనాథల్లా అంతమైపోయారు.

ప్రాజెక్టుల నిర్మాణానికి

రెక్కలు విరిగిన కూలీలెవ్వరు!

పేదవారి చరిత్ర సమస్తం

అస్తవ్యస్తం.

లక్షల రూపాయల పరిహారం

కుటుంబసభ్యుల

దుఃఖానికి ఖరీదు.

మిత్రులారా!

ఇవాళ అన్నం తింటుంటే

మీరే గుర్తుకొస్తున్నారు

రేపటినుంచి

అంతా సజావుగానే వుంటుంది.

డా. ఎన్‌.గోపి

(ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంలో మరణించిన కార్మికుల కోసం)

ఇవి కూడా చదవండి

Pakistan: రైలు హైజాక్.. బందీలుగా వందలాది ప్రయాణికులు

USA Deports Pak Diplomat: పాక్‌కు ఊహించని షాక్.. దౌత్యవేత్తకు అమెరికాలోకి అనుమతి నిరాకరణ

Read Latest and International News

Updated Date - Mar 12 , 2025 | 12:57 AM