Share News

Vividha : ఈ వారం వివిధ కార్యక్రమాలు 24 11 2025

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:57 AM

అందెశ్రీ సంస్మరణ సభ, ‘అభిరుచి’ సాహిత్య వ్యాసాలు...

Vividha : ఈ వారం వివిధ కార్యక్రమాలు 24 11 2025

అందెశ్రీ సంస్మరణ సభ

జాతీయ సంగీత కళాకారుల సంఘం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో అందెశ్రీ సంస్మరణ సభ నవంబరు 27 సా.5గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో ఏనుగు నరసింహారెడ్డి, కె. శ్రీనివాస్‌, ఎం. ప్రభాకర్‌, నాళేశ్వరం శంకరం, సిద్ధార్థ తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 98492 45137.

ఎల్‌. వి. చెన్నారావు

‘అభిరుచి’ సాహిత్య వ్యాసాలు

తెలంగాణ రచయితల సంఘం, జంటనగరాలు – సోమవారం కవి సమ్మేళనం ఆధ్వర్యంలో కొండపల్లి నీహారిణి సాహిత్య వ్యాసాల పుస్తకం ‘అభిరుచి’ ఆవిష్కరణ సభ నవంబరు 24 రాత్రి 7.30 నుంచి ఇంటర్నెట్‌ జూమ్‌ మీటింగ్‌లో జరుగుతుంది. ఇందులో ఏనుగు నరసింహారెడ్డి, రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, నెల్లుట్ల రమాదేవి, బెల్లంకొండ సంపత్‌ కుమార్‌ తదితరులు పాల్గొంటారు.

కందుకూరి శ్రీరాములు

ఇవి కూడా చదవండి

బీసీ రిజర్వేషన్లపై మరో మోసానికి తెర తీసిన కాంగ్రెస్: తలసాని

రైవాడ డ్యామ్‌లో పడవ బోల్తా.. ముగ్గరు మృతి

Updated Date - Nov 24 , 2025 | 04:57 AM