Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 28 01 2025

ABN , Publish Date - Jan 27 , 2025 | 12:54 AM

సాహిత్య సమాలోచన, ఉమర్‌ ఆలీ షా సాహిత్యంపై సదస్సు, ‘గూడు చెదిరిన దృశ్యం’ కవితా సంపుటి, విమర్శకునితో ఒక సాయంత్రం, కవిరాజు త్రిపురనేని పురస్కారం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 28 01 2025

సాహిత్య సమాలోచన

జమిలి సాహిత్య సాంస్కృతిక వేదిక, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో జనవరి 27 సా.4 గంటల నుంచి 9 గంటల వరకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో కవి సిద్ధార్థ కవితా సంపుటాలపై (దీపశిల, బొమ్మలబాయి, మల్లెలతీర్థం-మహాఖననం) కవిత్వ, తత్వ, అస్తిత్వ విచారణలో విమర్శకులు కె. శ్రీనివాస్, అంబటి సురేంద్ర రాజు, మామిడి హరికృష్ణ, త్రివేణి, భాను శ్రీ కొత్వాల్, బుచ్చన్న, ఆదిత్య తదితరులు పాల్గొంటారు.

జమిలి సాహిత్య సాంస్కృతిక వేదిక

ఉమర్‌ ఆలీ షా సాహిత్యంపై సదస్సు

‘బ్రహ్మర్షి డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా సాహిత్యం – బహుము ఖీనత’ అంశంపై రెండు రోజుల సదస్సు తెలుగు శాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం, చెన్నైలో జరుగుతుంది. జనవరి 27 ఉ.10గంటలకు మొదలయ్యే ఈ సదస్సులో అమెరికా, ఆఫ్రికా, యూకే, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌ తదితర ప్రాంతాల నుండి మొత్తం 66 మంది పత్ర సమర్పణ చేస్తారు. సద్గురు ఉమర్‌ ఆలీ షా, భువన చంద్ర, కోయి కోటేశ్వరరావు, వాసిలి వసంత కుమార్‌ తదితరులు పాల్గొంటారు.

విస్తాలి శంకరరావు


‘గూడు చెదిరిన దృశ్యం’ కవితా సంపుటి

కొండి మల్లారెడ్డి కవితా సంపుటి ‘గూడు చెదిరిన దృశ్యం’ ఆవిష్కరణ సభ జనవరి 30 సా.6గంటలకు సిద్ధిపేట ప్రెస్‌క్లబ్‌లో జరుగుతుంది. ప్రొఫెసర్ కోదండరాం, జూకంటి జగన్నాథం, బూర్ల వేంకటేశ్వర్లు, పర్కపెల్లి యాదగిరి, గఫూర్ శిక్షక్ హాజరవుతారు.

తెలంగాణ రచయితల వేదిక

విమర్శకునితో ఒక సాయంత్రం

సాహిత్య అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో ‘విమర్శకునితో ఒక సాయంత్రం’ కార్యక్రమంలో ఏటు కూరి ప్రసాద్‌ ప్రసంగిస్తారు. తర్వాత ఆహూతులతో ముఖాముఖి ఉం టుంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 1 సా.6గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది.

ఎస్‌వి సత్యనారాయణ


కవిరాజు త్రిపురనేని పురస్కారం

సూతపురాణం శతవసంతాల వేడుక, త్రిపురనేని జాతీయ పురస్కార సభ కార్య క్రమం జనవరి 29 ఉ.10గంటలకు జేకేసీ కాలేజ్‌ ఆడిటోరియం గుంటూరులో జరుగు తుంది. పురస్కారాన్ని దేవరాజు మహా రాజు, కొత్తపల్లి రవిబాబు స్వీకరిస్తారు. గద్దె మంగయ్య, బైరపనేని నరేష్‌, ఆలోకం పెద్ద బ్బయ్య, జొన్నలగడ్డ రామారావు, రావెల సాంబశివరావు తదితరులు పాల్గొంటారు.

త్రిపురనేని సాహితీ సమితి


ఈ వార్తలు కూడా చదవండి

Kandukuri Venkatesh: కష్టపడి కాన్వాస్‌ పెయింటింగ్‌ను చిత్రీకరించాను.

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jan 27 , 2025 | 12:54 AM