This Weeks Various Programs: ఈ వారం వివిధ కార్యక్రమాలు 29 12 2025
ABN , Publish Date - Dec 29 , 2025 | 05:43 AM
భూతం విమల స్మారక పురస్కారం, మద్దూరి నగేష్ బాబు పురస్కారం, కవిసంధ్య – సుధామ కవితల పోటీ, పైడి తెరేష్ బాబు పురస్కారం...
సాహిత్య వేదిక
పైడి తెరేష్ బాబు పురస్కారం
పైడి తెరేష్ బాబు స్మారక పురస్కారానికి 2023 నుంచి 2025 వరకు ప్రచురితమైన కథా సంపుటాలు నాలుగు కాపీలను జనవరి 20, 2026 లోపు పంపాలి. ఫిబ్రవరి 2026లో జరిగే పురస్కార ప్రదానంలో రూ.15వేల నగదు, మెమొంటోతో సత్కారం. చిరునామా: పి.శ్రీనివాస్ గౌడ్, 5–3–129/1, రోడ్ నెం: 2, బిల్డింగ్ నెం: 30, రామాలయం వీధి, శాంతి నగర్, కూకట్‌పల్లి, హైదరాబాద్ – 500 072, ఫోన్: 9949429449.
పి. శ్రీనివాస్ గౌడ్
కవిసంధ్య – సుధామ కవితల పోటీ
2026 మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కవి సంధ్య–సుధామ సంయుక్త నిర్వ హణలో నిర్వహిస్తున్న వచన కవితల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.3 వేలు, రూ.2వేలు, రూ.1500, ప్రోత్సహాక బహు మతులు 5 కవితలకు ఒక్కొక్కటీ రూ.500. బహు మతి ప్రదానం 2026 మార్చి 22. కవితలను ఫిబ్రవరి 20లోపు చిరునామా: దాట్ల దేవదానం రాజు, కవి సంధ్య కవితల పోటీ, జక్రియనగర్, యానాం–533464, ఫోన్:9440105987కు పంపాలి.
కవిసంధ్య
మద్దూరి నగేష్ బాబు పురస్కారం
మద్దూరి నగేష్ బాబు స్మారక పురస్కారానికి 2023 నుంచి 2025 వరకు ప్రచురితమైన కవితా సంపుటాలు నాలుగు కాపీలను జనవరి 20, 2026 లోపు పంపాలి. ఫిబ్రవరి 2026లో జరిగే పురస్కార ప్రదానంలో రూ.15వేల నగదు, మెమొంటోతో సత్కారం. చిరునామా: పి.శ్రీనివాస్ గౌడ్, 5–3–129/1, రోడ్ నెం: 2, బిల్డింగ్ నెం: 30, రామాలయం వీధి, శాంతి నగర్, కూకట్‌పల్లి, హైదరాబాద్ – 500 072, ఫోన్: 9949429449.
పి. శ్రీనివాస్ గౌడ్
భూతం విమల స్మారక పురస్కారం
‘భూతం విమల స్మారక పురస్కారం – 2026’ కోసం 2022 – 2025 మధ్య సామాజిక స్పృహతో రాసిన కథా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. ఎంపికైన సంపుటికి రూ.5116 పారితోషికంతో జనవరి 26, 2026న భూతం విమల రెండవ వర్ధంతిన నల్లగొండలో బహుమతి ప్రధానం. రచయితలు జనవరి 10 లోపు తమ కథల సంపుటాలు మూడు ప్రతులను చిరునామా:ఇం.నెం.4–11–117/1, చైతన్యపురి కాలనీ రోడ్ నెంబర్ 2, జి.వి. గూడెం రోడ్డు, నల్లగొండ–508001, ఫోన్: 7893033077కు పంపాలి.
భూతం ముత్యాలు
ఇవి కూడా చదవండి
వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..
బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..