నెలకు పదిరోజులు అసెంబ్లీ జరగాలి
ABN , Publish Date - Feb 08 , 2025 | 06:30 AM
ఉద్యోగులు ఆదివారం తప్ప మిగిలిన రోజులు ఉదయం పదిన్నరకు వచ్చి సాయంత్రం ఐదు దాకా తమ డ్యూటీ చెయ్యాలి. ఆలాగే పాఠశాలలు కూడా ఇన్ని రోజులు నడవాలి అని రూల్ ఉంది. కార్మికులు కూడా ఎనిమిది గంటలు పనిచెయ్యాలన్న రూలు ఉంది. ప్రజా సమస్యల్ని చర్చించి, పరిష్కరించాల్సిన శాసనసభ మాత్రం

ఉద్యోగులు ఆదివారం తప్ప మిగిలిన రోజులు ఉదయం పదిన్నరకు వచ్చి సాయంత్రం ఐదు దాకా తమ డ్యూటీ చెయ్యాలి. ఆలాగే పాఠశాలలు కూడా ఇన్ని రోజులు నడవాలి అని రూల్ ఉంది. కార్మికులు కూడా ఎనిమిది గంటలు పనిచెయ్యాలన్న రూలు ఉంది. ప్రజా సమస్యల్ని చర్చించి, పరిష్కరించాల్సిన శాసనసభ మాత్రం చాలా తక్కువ కాలం పనిచేస్తున్నది. నెలలో కనీసం పదిరోజులు అయినా శాసనసభ్యులు సమావేశమై, ప్రజల సమస్యల గురించి ఆలోచించేందుకు కృషిచేయాలి. ఒక్కొక్క శాసనసభ్యుడికి నెలకు అన్ని అలవెన్సులూ కలిపి లక్షల్లో జీతాలు ఉంటున్నాయి. అన్నీ ఉచితం. మాజీలు అయిన తరువాత పెన్షన్. ప్రోటోకాల్ ప్రకారం అన్ని కార్యక్రమాలలో ముందు సీటు కేటాయించాలి. ఇంత ప్రాముఖ్యత కలిగిన శాసనభ్యులు ఖచ్చితంగా పనిదినాలు పెంచుకోవాలి. మిగిలిన రోజుల్లో తమ నియోజకవర్గం పరిధిలో గల గ్రామాల్లో పర్యటించి, సమస్యలు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సమావేశాల్లోనే నెలకు పది రోజులు అసెంబ్లీ సమావేశాలు అన్న తీర్మానం చేయాలి.
– నార్నె వెంకటసుబ్బయ్య