ప్రరవే 16వ వార్షిక సదస్సు
ABN , Publish Date - Feb 08 , 2025 | 06:25 AM
లౌకిక ప్రజాస్వామిక విలువలని- కార్పొరేట్ ఫాసిస్ట్ శక్తుల నుంచి కాపాడుకోడానికి కావలసిన నైతిక ధైర్యాన్ని పోగుచేసుకొనటానికి అంబేడ్కర్ ఆలోచనలు ఉపయోగపడతాయన్న నమ్మకంతో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) అంబేడ్కర్

లౌకిక ప్రజాస్వామిక విలువలని- కార్పొరేట్ ఫాసిస్ట్ శక్తుల నుంచి కాపాడుకోడానికి కావలసిన నైతిక ధైర్యాన్ని పోగుచేసుకొనటానికి అంబేడ్కర్ ఆలోచనలు ఉపయోగపడతాయన్న నమ్మకంతో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) అంబేడ్కర్ రచనల అధ్యయనం మొదలుపెట్టింది. గత డిసెంబర్ 22 నుంచి ప్రతి ఆదివారం ‘అంబేడ్కర్ ఆలోచనల తాత్వికత’పై రెండు ప్రసంగాలతో అంతర్జాల కార్యక్రమం ప్రారంభించింది. ఇది 2025 జూన్ వరకూ సాగుతుంది. ఈ ప్రయత్నం మరింత సమగ్రం కావడం కోసం ప్రరవే 16వ వార్షిక సదస్సు ‘తెలుగు సాహిత్యం–అంబేడ్కర్ ప్రభావం’ అన్న అంశాన్ని ఎంచుకుంది. అంబేడ్కర్ ఆలోచనల వెలుగులో తెలుగు సాహిత్యాన్ని విలువకట్టటం అంటే అది ఎంత ప్రజాస్వామికం అయిందో తెలుసుకొనటమే అవుతుంది. ఈ నెల 8, 9 తేదీలలో సిద్ధిపేటలోని విపంచి కళానిలయం, బోయి విజయభారతి ప్రాంగణంలో సదస్సు జరగనున్నది. తొలిరోజు నందిని సిధారెడ్డి, అల్లం నారాయణ, ఆచార్య మధుజ్యోతి, సిద్దెంకి యాదగిరి, ఆచార్య బన్న అయిలయ్య, డా. కోయి కోటేశ్వరరావు, డా. గంధం అరుణ, డా. గుంటూరు లక్ష్మీనరసయ్య, కాత్యాయనీ విద్మహే, తిరునగరి దేవకీదేవి పాల్గొంటారు. మరుసటి రోజు పసునూరి రవీందర్,
కె. రంగాచార్య, నరేష్ కుమార్ సూఫీ పాల్గొంటారు.
–ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక