Share News

Wings Of Freedom: రెక్కల పక్షి

ABN , Publish Date - Aug 11 , 2025 | 01:20 AM

రెక్కల పక్షికి తెలిసే ఉంటుంది నేల ఈనిన స్థాణువై పడిఉంటే చెదలకైనా చులకనే అని అందుకే ఎగిరే కలని ఊపిరిగా ప్రాణం...

Wings Of Freedom: రెక్కల పక్షి

రెక్కల పక్షికి తెలిసే ఉంటుంది

నేల ఈనిన స్థాణువై పడిఉంటే

చెదలకైనా చులకనే అని

అందుకే ఎగిరే కలని ఊపిరిగా ప్రాణం

పోసుకుంటుంది

బురద మడుగులో ఉప్పెన పుడుతుందా!

విస్తరించి చూడు అలల నురగలెత్తి

నింగి కళ్ళలో నీలమై మెరిసేలా

నిత్య చైతన్య స్రవంతికి నువ్వే నాంది.

తన నిశ్చల చలనానికి

వన్నెలద్దే గాలి రెపరెపలపై

పూలు కురిపిస్తుంది చెట్టు ఇష్టంగా.

ఉన్నచోటే ఉండిపోతే ఊపిరి సైతం బరువౌతుంది

నింగి అంచులోనో కొండ కొమ్ముపైనో

మేఘాల వేలుపట్టి తేలిపో

నింగి సంబరమై కురిసే వానలో

స్నేహితంగా తడిసిపో...

బాట పొడవునా నిన్నే నువ్వు కలుసుకుంటూ

మందిగా మారిపో!

కొన్ని సొదలు గుండెలో గూడు కట్టుకుంటాయి

కొత్త ఆశలు పురుడు పోసుకుటాయి

అచ్చంగా రెక్కల పక్షికి మల్లే....

సురేష్

99663 21122

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 01:20 AM